బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచే సూపర్ డ్రింక్ ఇది..!
TeluguStop.com
తల్లిపాల విశిష్టత( Breast Milk Specificity ) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
బిడ్డకు దాదాపు ఆరు నెలల వయసు వచ్చేవరకు తల్లిపాలే ప్రధాన ఆహారం.అయితే కొందరు బాలింతల్లో పాల ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది.
దీని కారణంగా పిల్లలకు తల్లిపాల కొరత అనేది ఏర్పడుతుంది.అయితే బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు కొన్ని కొన్ని ఆహారాలు చాలా బాగా సహాయపడతాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ కూడా ఆ కోవకే చెందుతుంది.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు డ్రై అంజీర్( Dry Fig ), వన్ టేబుల్ స్పూన్ నల్ల ఎండు ద్రాక్ష( Black Currant ), నాలుగు బాదం గింజలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ) మరియు రెండు జీడిపప్పులు వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు బ్లెండర్ తీసుకుని అందులో నానపెట్టుకున్న పదార్థాలను వాటర్ తో సహా వేసుకోవాలి.
అలాగే ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు పోసి మెత్తగా బ్లెండ్ చేశారంటే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.
"""/" /
బాలింతలు రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ డ్రై ఫ్రూట్ డ్రింక్ ను కనుక తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.
ఈ డ్రింక్ లో ఐరన్, కాల్షియం, ఫైబర్ మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.
రెగ్యులర్ డైట్ లో ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే బాలింతల్లో పాల ఉత్పత్తి అద్భుతంగా మెరుగుపడుతుంది.
"""/" /
అలాగే డెలివరీ నుంచి త్వరగా రికవరీ అయ్యేందుకు, శరీరానికి అవసరమయ్యే శక్తిని చేకూర్చేందుకు ఈ డ్రింక్ తోడ్పడుతుంది.
అంతేకాకుండా డెలివరీ తర్వాత చాలా మంది అమ్మలు హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటారు.
అయితే ఇప్పుడు చెప్పుకున్న డ్రై ఫ్రూట్ డ్రింక్ ను తీసుకుంటే ఆ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
చర్మం సైతం నిగారింపుగా మారుతుంది.
అప్పుడు రజనీకాంత్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్… జపాన్ లో ఆ ఘనత వీళ్లకే సొంతమా?