ఎండ‌ల దెబ్బ‌కు అల‌సిన శ‌రీరాన్ని యాక్టివ్‌గా మార్చే సూప‌ర్ డ్రింక్ ఇదే!

ఏప్రిల్ నెల‌లోకి అడుగు పెట్టామో లేదో ఎండ‌లు తారా స్థాయికి చేరుకున్నాయి.ఉద‌యం 9 గంట‌ల నుంచే భానుడు భగభగమంటున్నాడు.

దీంతో రోజురోజుకు రికార్డు స్థాయిలో ఉష్ట్రోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి.అయితే వేస‌వి కాలంలో ఎండ‌ల దెబ్బ‌కు త‌ర‌చూ శ‌రీరం అల‌సిపోతుంటుంది.

ఆ అల‌స‌ట కార‌ణంగా ఏ ప‌ని చేయ‌లేక‌పోతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ టేస్టీ డ్రింక్‌ను తీసుకుంటే.

ఎండ‌ల వ‌ల్ల అల‌సిన శ‌రీరాన్ని క్ష‌ణాల్లో యాక్టివ్‌గా మార్చుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు లేటు ఆ డ్రింక్ ఏంటీ.

? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక బ్లెండ‌ర్ తీసుకుని అందులో నాలుగు నుండి ఆరు టేబుల్ స్పూన్ల పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ ప‌టిక బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఎండిన గులాబీ రేక‌లు, పావు స్పూన్ యాల‌కుల పొడి, చిటికెడు బ్లాక్ సాల్ట్‌, నాలుగు ఐస్ క్యూబ్స్‌, ఒక క‌ప్పు వాట‌ర్ వేసుకుని గ్రౌండ్ చేసుకోవాలి.

"""/" / ఆ త‌ర్వాత గ్రౌండ్ చేసుకున్న మిశ్ర‌మంలో వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్‌ను యాడ్ చేస్తే స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రింక్ సిద్ధ‌మైన‌ట్టే.

ఎండ‌ల వ‌ల్ల బాగా అల‌సిపోయిన‌ప్పుడు చాలా మంది కూల్ డ్రింక్స్‌, కాఫీ, టీ, కూలింగ్ వాట‌ర్ వంటివి తాగుతుంటారు.

కానీ, వాటి బ‌దులు ఇప్పుడు చెప్పిన డ్రింక్‌ను త‌యారు చేసి తీసుకుంటే.మీ శ‌రీరం వెంట‌నే యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా మారుతుంది.

ఈ మూడ్ కూడా చిల్ అవుతుంది.అంతే కాదు, పైన చెప్పిన డ్రింక్‌ను స‌మ్మ‌ర్‌ను త‌ర‌చూ తాగితే పెరిగిన మీ శ‌రీర ఉష్ట్రోగ్ర‌త‌లు అదుపులోకి వ‌స్తాయి.

త‌ల‌నొప్పి, నీర‌సం, అధిక ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.మ‌రియు హీట్ స్ట్రోక్‌, డీహైడ్రేషన్ వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏమైనా  సంబంధం ఉందా ?