ఇదేం విడ్డూరం.. థాయిలాండ్ స్మశానంలో చచ్చిపోయిన వారికి మూవీ స్క్రీనింగ్..??
TeluguStop.com
నక్షత్రాలతో నిండిన అందమైన రాత్రి సమయంలో బహిరంగ ప్రదేశంలో సినిమా చూడటం అద్భుతమైన అనుభవం.
ఇది సినిమా చూసే అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా చేస్తుంది.ఎల్లవేళలా డేట్‌కి బెస్ట్ ఐడియా అని చెప్పే ఈ అనుభవాన్ని థాయ్‌లాండ్‌లో మరోలా వాడారు.
నమ్మశక్యం కానీ విషయం ఏంటంటే, అక్కడ శ్మశాన వాటికలో చనిపోయిన వారి కోసం సినిమాలు ప్రదర్శించారు.
వార్తాల ప్రకారం, ఈ సినిమా ప్రదర్శన జూన్ 2 నుంచి జూన్ 6 వరకు జరిగింది.
ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని "సవాంగ్ మెట్టా థమ్మసథాన్ ఫౌండేషన్" ( Sawang Metta Thammasathon Foundation )నిర్వహించింది.
ఈశాన్య థాయ్‌లాండ్‌లోని నఖోన్ రాట్చసిమా ( Nakhon Ratchasima, Thailand )ప్రావిన్స్‌లో ఉన్న శ్మశాన వాటికలో దాదాపు 3,000 మంది పూర్వీకులు ఖననం అయ్యారు.
చనిపోయిన వారి ఆత్మలను శాంతపరచడానికి, వారికి కొత్తరకం వినోదాన్ని అందించడానికే ఈ సినిమా ప్రదర్శన ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
"""/" /
రిపోర్ట్‌లో మరికొన్ని విశేషాలు ఉన్నాయి.ఈ సినిమా చూసిన ఆత్మలు చైనా నుంచి థాయ్‌లాండ్‌కు( China To Thailand ) వలస వచ్చాయట.
వాళ్లు తిరిగి చైనా వెళ్లలేకపోయారట.ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి అర్ధరాత్రి వరకు సినిమా ప్రదర్శన జరిగిందట.
ఈ ఆసక్తికరమైన ఈవెంట్‌లో ఆత్మలతో పాటు, నలుగురు సిబ్బంది కూడా ఉన్నారు.ఇంకో ట్విస్ట్ కూడా ఉంది.
సినిమాతో పాటు, చనిపోయిన వారి కోసం పండుగ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.
అన్నం, బట్టలు, వాహనాలు, ఇళ్ల నమూనాలు వంటి వారి రోజువారీ వస్తువులు కూడా అక్కడ ఉంచారు.
"""/" /
థాయ్‌లాండ్‌లోని చైనీస్ సమాజాల్లో చనిపోయిన వారి కోసం సినిమా ప్రదర్శనలు వేయడం ఒక ఆచారం.
ఇది చింగ్ మింగ్ పండుగ తర్వాత లేదా డ్రాగన్ బోట్ పండుగకు ముందు జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి కాంట్రాక్టర్ ఒకాయన, శ్మశాన వాటికలో సినిమాలు చూపించడం మొదట్లో భయంగా ఉందని చెప్పారు.
కానీ, కొంతసేపటి తర్వాత, ఇది చాలా సానుకూల అనుభవం అని ఆయన వివరించారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కొందరు దీన్ని భయంకరమైన ఆలోచన అంటే, మరికొందరు దీన్ని ఆసక్తికరమైన ఆచారంగా భావించారు.