ఇదేం వింత శవపేటిక.. స్నికర్స్‌తో బ్రిటిష్ వ్యక్తి అంత్యక్రియలు.. వైరల్ ఫొటో వెనుక అసలు కథ?

ఇదేం వింత శవపేటిక స్నికర్స్‌తో బ్రిటిష్ వ్యక్తి అంత్యక్రియలు వైరల్ ఫొటో వెనుక అసలు కథ?

సోషల్ మీడియాలో ఓ వింత ఫొటో వైరల్ అవుతోంది.అదేంటంటే, స్నికర్స్ చాక్లెట్​లాంటి శవపేటిక.

ఇదేం వింత శవపేటిక స్నికర్స్‌తో బ్రిటిష్ వ్యక్తి అంత్యక్రియలు వైరల్ ఫొటో వెనుక అసలు కథ?

చూసినోళ్లంతా "ఇదేం వింత?" అని ముక్కున వేలేసుకుంటున్నారు.అసలు సంగతి ఏంటంటే, బ్రిటన్‌కు చెందిన పాల్ బ్రూమ్ అనే వ్యక్తి చనిపోతే, ఆయన కోసం వాళ్ల కుటుంబ సభ్యులు స్నికర్స్ చాక్లెట్​లాంటి శవపేటికను తయారు చేయించారు.

ఇదేం వింత శవపేటిక స్నికర్స్‌తో బ్రిటిష్ వ్యక్తి అంత్యక్రియలు వైరల్ ఫొటో వెనుక అసలు కథ?

పాల్ సరదాగా నవ్వుతూ జోకులు వేసుకుంటూ ఉండే మనిషి.ఆయన చివరి కోరిక కూడా అందర్నీ సరదాగా నవ్వించడమేనట.

పాల్ బ్రూమ్ ఎప్పుడూ సరదాగా "నేను కాస్త వెర్రి (Nuts)గా ఉంటాను" అని జోకులేసుకునేవాడట.

స్నికర్స్ చాక్లెట్​ యాడ్​లో "ఆకలిగా ఉంటే నువ్వు నువ్వులా ఉండవు" అని వస్తుంది కదా, ఆ స్లోగన్​ను, స్నికర్స్‌లో నట్స్ గుర్తు చేసుకుని ఆయన ఫ్యామిలీ ఇలాంటి శవపేటికను డిజైన్ చేయించింది.

దానిపై పెద్ద పెద్ద నట్స్ బొమ్మలు కూడా వేశారు.అంతేకాదు, "ఐయామ్ నట్స్" అని కూడా రాసి ఉంది.

"""/" / పాల్ ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే మనిషి కాబట్టి, ఆయన అంతిమయాత్రను కూడా చాలా సందడిగా చేశారు వాళ్ల కుటుంబ సభ్యులు.

మామూలుగా అంత్యక్రియల్లో అందరూ దిగాలుగా ఉంటారు కదా కానీ వీళ్లు మాత్రం రంగురంగుల టీ-షర్టులు (T-shirts)వేసుకున్నారు.

చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు.దుఃఖాన్ని దిగమింగుకుని, ఆనందంగా ఆయనకు వీడ్కోలు పలికారు.

పాల్‌కు ఇష్టమైన కెఫే దగ్గర కూడా ఊరేగింపు కాసేపు ఆగింది. """/" / స్నికర్స్ శవపేటిక ఫొటో ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ అయిపోయింది.

పాల్‌ను అంత ప్రత్యేకంగా వీడ్కోలు పలికిన ఆయన ఫ్యామిలీని అందరూ మెచ్చుకుంటున్నారు.అతడి సరదా కోరికను నిజం చేసినందుకు, ఇంత క్రియేటివ్‌గా అంతిమ సంస్కారాలు జరిపినందుకు నెటిజన్లు వాళ్లని అభినందిస్తున్నారు.

పాల్ కుటుంబ సభ్యులు దుఃఖంలోనూ ఆయన జ్ఞాపకాలను సెలబ్రేట్ చేసుకున్న తీరు నిజంగా అద్భుతం.

స్నికర్స్ శవపేటిక ద్వారా పాల్ వ్యక్తిత్వాన్ని చాటిచెప్పారు.అతని సరదా స్వభావం అందరికీ గుర్తుండిపోయేలా చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025