చెవి పోటును త‌రిమికొట్టే సింపుల్ టిప్ ఇది.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి!

చెవి పోటు.దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు.

ప్రధానంగా ఇన్ఫెక్షన్ వల్ల చెవి పోటు వేధిస్తూ ఉంటుంది.చెవి నొప్పి అనేది చిన్న సమస్యగానే కనిపించిన తీవ్రమైన బాధను, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

చెవి పోటు వల్ల రాత్రుళ్లు నిద్ర కూడా స‌రిగ్గా పట్టదు.ఏ పని పైన దృష్టి సారించలేకపోతుంటారు.

ఈ క్రమంలోనే చెవి పోటును తగ్గించుకోవడం కోసం పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్ ను పాటిస్తే ఎలాంటి పెయిన్ కిల్ల‌ర్స్‌ను వాడ‌కుండానే చాలా సులభంగా మరియు వేగంగా చెవి పోటును నివారించుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం చెవి పోటును తరిమి కొట్టే ఆ సింపుల్ టిప్ ఏంటి.

? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను ఒక బౌల్ లోకి సపరేట్ చేసుకోవాలి.

"""/"/ ఈ బౌల్ ను మరుగుతున్న నీటిలో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉంచి వేడి చేయాలి.

అనంతరం ఈ మిశ్రమాన్ని చెవిలో రెండు నుంచి మూడు చుక్కల వరకు వేసుకోవాలి.

ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే ఇన్ఫెక్షన్ నాశనం అవుతుంది.దాంతో చెవి పోటు నుంచి చ‌క్క‌టి ఉపశమనం లభిస్తుంది.

కాబట్టి చెవి పోటుతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు కచ్చితంగా పైన చెప్పిన‌ చిట్కాను ప్రయత్నించండి.

చెవి పోటు ఇట్టే దూరం అవుతుంది.

పుష్ప 2 తో అల్లు అర్జున్ ఆ ఘనతను సాధిస్తాడా..?