ప‌ది రోజుల్లో డార్క్ స‌ర్కిల్స్ ను మ‌టుమాయం చేసే సింపుల్ రెమెడీ ఇదే!

డార్క్ స‌ర్కిల్స్‌.వ‌య‌సుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని తీవ్రంగా మ‌ద‌న పెట్టే కామ‌న్ స‌మ‌స్య ఇది.

ఎండ‌ల్లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, కండి నిండా నిద్ర లేక‌పోవ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, శ‌రీరంలో అధిక వేడి, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, పోష‌కాల కొర‌త వంటి కార‌ణాల వ‌ల్ల క‌ళ్ల చుట్టూ డార్క్ స‌ర్కిల్స్ ఏర్పడుతుంటాయి.

ఈ డార్క్ స‌ర్కిల్స్ వ‌ల్ల ముఖ‌మే క‌ల త‌ప్పిన‌ట్లు క‌నిపిస్తుంది.దాంతో ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌టం కోసం వివిధ ప్ర‌యోగాలు చేస్తుంటారు.

ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్స‌లు చింతించ‌కండి.

ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే గ‌నుక ప‌ది రోజుల్లోనే డార్క్ స‌ర్కిల్స్ మ‌టుమాయం అవుతాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక కీర దోసను తీసుకుని వాట‌ర్‌లో శుభ్రంగా క‌డిగి స‌న్న‌గా తురుముకోవాలి.

ఈ తురుము నుంచి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి అర గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో వ‌న్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడ‌ర్ వేసుకుని ప‌ది నిమిషాల పాటు మ‌రిగించాలి.

బాగా మ‌రిగాక‌ స్ట్రైన‌ర్ సాయంతో డికాక్ష‌న్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని చ‌ల్లార‌బెట్టుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ కీరా జ్యూస్‌, ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్ గ్రీన్ టీ, వ‌న్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ మరియు హాఫ్ టేబుల్ స్పూన్ కొక‌న‌ట్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఈ మిశ్ర‌మాన్ని ఒక బాక్స్‌లో నింపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

రాత్రి నిద్రించే ముందు ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే డార్క్ స‌ర్కిల్స్ క్ర‌మంగా త‌గ్గిపోతాయి.