ముఖంపై అవాంఛిత రోమాల‌ను సుల‌భంగా తొల‌గించే సింపుల్ రెమెడీ ఇదే!

ముఖంపై అవాంఛిత రోమాలు.చాలా మంది అమ్మాయిలను కలవరపెట్టే సమస్య ఇది.

పీసీఓఎస్ లేదా పిసిఓడి, హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన లోపాలు, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల ముఖంపై అవాంఛిత రోమాలు వస్తుంటాయి.

కారణం ఏదైనా ఈ రోమాలు తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయి.పైగా చూపురుల‌కు అందవిహీనంగా కనిపిస్తాయి.

ఈ క్రమంలోనే అవాంఛిత రోమాలను తొలగించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.మీరు కూడా ఈ లిస్టులో ఉన్నారా.

? అయితే ఇకపై నో టెన్షన్.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే కనుక ముఖంపై అవాంఛిత రోమాలను చాలా అంటే చాలా సులభంగా తొలగించుకోవచ్చు.

అలాగే ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ములేటి(అతిమధురం) పౌడర్ ను వేయాలి.

అలాగే అందులో వ‌న్‌ టేబుల్ స్పూన్ శనగపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి.

ఆ తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్ల రైస్ వాటర్, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/"/ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం తడి వేళ్ళతో చర్మాన్ని స్మూత్ గా సర్క్యులర్ మోషన్ లో రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రం క్లీన్ చేసుకోవాలి.

రోజుకి ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే ముఖంపై ఎలాంటి అవాంఛిత రోమాలు ఉండవు.

పైగా చర్మంపై పేరుకు పోయిన మలినాలు, మృత కణాలు తొలగిపోయి ముఖం అందంగా మరియు కాంతివంతంగా మెరుస్తుంది.

వీడియో: కదులుతున్న ట్రక్కు వెనుక డేంజరస్ స్టంట్ చేసిన యువకులు.. చివరికి..?