రోజు నైట్ నిద్రించే ముందు ఇలా చేస్తే డ్రై స్కిన్ అన్న మాట అనరు!
TeluguStop.com
సాధారణంగా అందరి చర్మ తత్వాలు ఒకేలా ఉండవు.కొందరిది ఆయిలీగా ఉంటే.
కొందరిది డ్రై గా ఉంటుంది.ఇంకొందరికి న్యూట్రల్ గా ఉంటుంది.
అయితే చాలా మంది ఆయిలీ స్కిన్ వారికే అన్ని సమస్యలు అని భావిస్తుంటారు.
కానీ డ్రై స్కిన్ ను కలిగిన వారు కూడా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తుంటారు.
డ్రై స్కిన్ వల్ల దురద, చికాకు, మంట, చర్మం పొరలు పొరలుగా ఊడటం తదితర సమస్యలు తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.
ఈ క్రమంలోనే డ్రై స్కిన్ ను వదిలించుకోవడం కోసం ఖరీదైన క్రీమ్స్, లోషన్స్ వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మాత్రం డ్రై స్కిన్ నుంచి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్‌ను తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి.
ఆ తరువాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ నీమ్ ఆయిల్, రెండు విటమిన్ ఇ క్యాప్సిల్స్ ఆయిల్ వేసుకుని స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.
అనంతరం ఈ ఆయిల్ ను ముఖానికి అప్లై చేసి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
"""/"/
కనీసం పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను ముఖానికి అప్లై చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ ను క్లీన్ చేసుకోవాలి.
ఈ సింపుల్ రెమెడీని ప్రతి రోజు గనుక పాటిస్తే డ్రై స్కిన్ అన్న మాటే అనరు.
పైగా ఈ రెమెడీ వల్ల చర్మం పై మొండి మచ్చలు ఉన్నా.అవి క్రమంగా దూరం అవుతాయి.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?