ముఖాన్ని క్షణాల్లో అద్దంలా మెరిపించే సింపుల్ హోం రెమెడీ ఇదే!
TeluguStop.com
అర్జెంట్ గా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం డల్‌గా, నిర్జీవంగా కనిపిస్తే.ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు.
అసలు బయటకు వెళ్లాలన్న మూడు, ఉత్సాహం కూడా పోతాయి.అయితే అలాంటి పరిస్థితిలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోం రెమెడీని ట్రై చేస్తే.
క్షణాల్లోనే ముఖం అద్దంలా అందంగా, ఆకర్షణీయంగా మెరుస్తుంది.మరి ఇంతకీ ఆ సింపుల్ హోం రెమెడీ ఏంటో లేట్ చేయకుండా ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక గిన్నెలో పది బాదం పప్పులు వేసుకుని హాట్ వాటర్ పోసి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.
ఆ తర్వాత వేడి నీటిలో వేసిన బాదం పప్పులను తీసుకుని తొక్క తొలగించి మిక్సీ జార్‌లో వేసుకోవాలి.
అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ పాల మీగడ కూడా వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ శెనగపిండి, గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్, చిటికెడు ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం, సరిపడా రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
"""/" /
అనంతరం వేళ్లతో సున్నితంగా చర్మాన్ని రుద్దుకుంటూ ఐస్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఈ సింపుల్ రెమెడీని గనుక ట్రై చేస్తే.క్షణాల్లోనే డల్‌గా మరియు నిర్జీవంగా ఉన్న ముఖం అద్దం మాదిరి అందంగా మెరుస్తుంది.
అంతేకాదు, చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ సైతం ఈ రెమెడీ ద్వారా తొలగించుకోవచ్చు.
కాబట్టి, ముఖం డల్‌గా ఉన్నప్పుడు ఏం చేయాలో అని హైరానా పడకుండా.ఈ ఫేస్ ప్యాక్‌ను వేసుకునేందుకు ప్రయత్నించండి.
ఓటీటీ రైట్స్‌తో కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే.. ఈ సినిమాలదే అద్భుతమైన రికార్డ్!