బలహీనంగా పల్చగా మారిన కురులను రిపేర్ చేసే రెమెడీ ఇది.. అస్సలు మిస్ అవ్వొద్దు!

పోషకాల కొరత, పెరిగిన కాలుష్యం, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, వేడి వేడి నీటితో తరచూ తలస్నానం చేయడం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూ వినియోగించడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వాడటం.

తదితర కారణాల వల్ల చాలా మంది జుట్టు( Hair ) బలహీనంగా మరియు పల్చగా మారుతుంది.

హెయిర్ ఫాల్ అనేది అధికంగా ఉంటుంది.దీంతో తెగ హైరానా పడిపోతుంటారు.

అయితే బలహీనంగా పల్చగా మారిన కురులను రిపేర్ చేసే రెమెడీ ఒకటి ఉంది.

ఈ రెమెడీని పాటిస్తే మళ్లీ మీ హెయిర్ హెల్తీగా, స్ట్రాంగ్ గా మరియు ఒత్తుగా మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో మిస్ అవ్వకుండా ఓ చూపు చూసేయండి.

"""/"/ ముందుగా ఒక ఉల్లిపాయ( Onion )ను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో ఉల్లిపాయ జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు ఎగ్స్( Eggs ) ను బ్రేక్ చేసి వేసుకోవాలి.

అలాగే ఉల్లిపాయ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

"""/"/ వారానికి ఒక్కసారి ఈ రెమెడీని గనుక పాటిస్తే గుడ్డు లో ఉండే ప్రోటీన్, విటమిన్లు.

ఉల్లి రసంలో ఉండే సల్ఫర్ బలహీనమైన కురులను బలంగా మారుస్తాయి.హెయిర్ గ్రోత్( Hair Growth ) ను ఇంప్రూవ్ చేస్తాయి.

పల్చగా ఉండే జుట్టును ఒత్తుగా మారుస్తాయి.అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ స్కాల్ప్ ను లోతుగా శుభ్రం చేస్తుంది.

చుండ్రు సమస్యను నివారిస్తుంది.ఇక విటమిన్ ఈ ఆయిల్ మీ కురులను సిల్కీగా, షైనీ గా మెరిపిస్తుంది.

డ్రై హెయిర్ సమస్యకు అడ్డుకట్ట వేస్తుంది.

బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ వీడియో లీక్.. బాధితురాలు ఏం చేసిందంటే..??