ముడతలను మాయం చేసి ముఖాన్ని అద్దంలా మెరిపించే రెమెడీ ఇదే!
TeluguStop.com
వాతావరణంలో వచ్చే మార్పులు, పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం, మేకప్‌తో నిద్రించడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం వంటి రకరకాల కారణాల వల్ల ఇటీవల రోజుల్లో చాలా మంది వయసు పైబడక ముందే ముడతల సమస్యను ఫేస్ చేస్తున్నారు.
ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు చెంతించకండి.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే ముడతలు మాయం అవ్వడమే కాదు ముఖం అద్దంలా మెరిసిపోవడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో చూసేయండి.ముందుగా ఓ పది జీడిపప్పులను ఐదారు గంటల పాటు ఒక కప్పు నీటిలో వేసుకుని నానబెట్టుకోవాలి.
ఇలా నానబెట్టుకున్న జీడిపప్పులను వాటర్‌తో సహా మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకుంటే.
జీడిపప్పు పాలు తయారవుతాయి.ఈ జీడిపప్పు పాలల్లో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ సన్ ఫ్లెవర్ సీడ్స్ ను మిక్స్ చేసి.
మూతపెట్టుకుని రాత్రంతా వదిలేయాలి.ఉదయాన్నే మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్, సన్ ఫ్లెవర్ సీడ్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
బాగా కలుపుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.
ఇరవై లేదా ముప్పై నిమిషాల అనంతరం కూల్ వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకుని.
ఏదైనా మాయిశ్చరైజర్ లేదా సీరమ్‌ను ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే ముడతలు క్రమంగా తొలగిపోయి ముఖం అద్దంలా అందంగా, ఆకర్షణీయంగా మెరిసిపోతుంది.
ఇక మరో విషయం ఏంటంటే.పైన చెప్పిన రెమెడీలో జీడిపప్పు పాలకు బదులు మామూలు పాలు లేదా బాదం పాలను కూడా యూస్ చేయవచ్చు.