క్యాన్సర్ రిస్క్ ను తగ్గించే పవర్ ఫుల్ స్మూతీ ఇది.. తప్పకుండా డైట్ లో చేర్చుకోండి!

ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.అలాగే ప్రతి ఏడాది క్యాన్సర్ మహమ్మారి కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.

క్యాన్సర్ బారిన పడటం వల్ల శారీరకంగానే కాదు ఆర్థికంగా కూడా చితికిపోతుంటారు.అనారోగ్యకరమైన ఆహార విధానం, ధూమపానం, మద్యపానం, కాలుష్యం తదితర అంశాలు క్యాన్సర్ కు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

అయితే క్యాన్సర్ వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.

ముఖ్యంగా క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడానికి కొన్ని కొన్ని ఆహారాలు ఉత్తమంగా సహాయపడతాయి.

అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ స్మూతీ కూడా ఒకటి.ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ బారిన ప‌డే అవకాశాలు తగ్గుతాయి.

అదే సమయంలో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు సైతం లభిస్తాయి.మరి ఇంతకీ ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక ఆరెంజ్ ను తీసుకుని తొక్క తొలగించి లోపల ఉండే ప‌ల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.

"""/" / అలాగే ఒక గ్రీన్ యాపిల్ ను తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

మరోవైపు ఒక గిన్నెలో మూడు డ్రై ఆప్రికాట్స్ వేసి వాటర్ పోసి కనీసం నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండ‌ర్‌ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ ఆపిల్ ముక్కలు, ఆరెంజ్ పల్ప్ వేసుకోవాలి.

అలాగే నానబెట్టుకున్న ఆప్రికాట్స్, అర అంగుళం పొట్టు తొలగించిన పచ్చి పసుపు కొమ్ము మరియు ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన స్మూతీ సిద్ధమవుతుంది.

"""/" / ఈ గ్రీన్ ఆపిల్ ఆరెంజ్ స్మూతీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా ఈ స్మూతీలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకట్ట వేస్తాయి.

క్యాన్సర్ వచ్చే రిస్క్ ను త‌గ్గిస్తాయి.అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్‌ స్ట్రాంగ్ గా మారుతుంది.

గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటారు.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

మరియు రక్తహీనత సమస్య సైతం దూరం అవుతుంది.

పర్ఫెక్షన్ కోసం కష్టపడుతున్న ప్రభాస్…కారణం ఏంటంటే..?