మొటిమ‌లు ఎంత‌కీ త‌గ్గట్లేదా..? అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

మొటిమ‌లు.అందాన్ని చెడ‌గొట్ట‌డంలో ఇవి ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

ఆయిలీ ఫుడ్స్‌, బేక‌రీ ఫుడ్స్‌, షుగ‌ర్ తో త‌యారు చేసిన ఫుడ్స్‌ను అధికంగా తీసుకోవ‌డం, హార్మోన్ ఛేంజ‌స్‌, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం, చుండ్రు, చ‌ర్మంపై ఆయిల్ ఉత్ప‌త్తి ఎక్కువ‌గా ఉండ‌టం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల మొటిమ‌లు ఏర్ప‌డుతుంటాయి.

కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ ఒక్కోసారి మొటిమ‌లు ఎంత‌కీ త‌గ్గ‌కుండా తీవ్ర‌మైన నొప్పిని క‌ల‌గ‌జేస్తుంటాయి.దాంతో వాటిని ఎలా నివారించుకోవాలో తెలియ‌క తెగ మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ప‌వ‌ర్ ఫుల్ హోం రెమెడీని ట్రై చేశారంటే.చాలా అంటే చాలా సుల‌భంగా మొండి మొటిమ‌ల‌ను వ‌దిలించుకోవ‌చ్చు.

మ‌రి ఇంత‌కీ ఈ రెమెడీని ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని వ‌న్ టేబుల్ స్పూన్ జీల‌క‌ర్ర‌, మూడు ల‌వంగాలు వేసి స్ల్రైట్ గా వేయించుకోవాలి.

"""/" / ఇప్పుడు వేయించుకున్న జీల‌క‌ర్ర మ‌రియు ల‌వంగాల‌ను మెత్త‌టి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మ‌ట్టి, సరిపడా రోజ్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఇలా మిక్స్ చేసుకున్న‌ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకుని ఆర‌బెట్టుకోవాలి.

కంప్లీట్ గా డ్రై అయిన అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఈ సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ రెమెడీని రోజుకు ఒక సారి ట్రై చేస్తే గ‌నుక ఎంత‌టి మొండి మొటిమ‌లు అయినా వేగంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

అంతేకాదండోయ్‌.ఈ రెమెడీని పాటిస్తే మొటిమ‌లు తాలూకు మ‌చ్చ‌లు సైతం క్ర‌మంగా మాయం అవుతాయి.

కాబ‌ట్టి, మొండి మొటిమ‌లతో స‌త‌మ‌తం అయ్యే వారు త‌ప్ప‌కుండా ఈ హోం రెమెడీని ప్ర‌య‌త్నించండి.

రోజమ్మ నా అమ్మ.. వైరల్ అవుతున్న రాకింగ్ రాకేష్ ఎమోషనల్ కామెంట్స్!