ఈ పవర్ ఫుల్ ఆయిల్ ను వాడితే పురుషుల్లో ఎంతటి తీవ్రమైన హెయిర్ ఫాల్ అయినా పరారే!

సాధారణంగా కొందరి పురుషుల్లో హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటుంది.

ఒత్తిడి, జాబ్ టెన్షన్స్, పోషకాల కొరత, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం, మద్యపానం, ధూమపానం త‌దితర కారణాల వల్ల పురుషుల్లో జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.

అయితే కారణం ఏదైనా ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ ను కనుక వాడితే పురుషుల్లో ఎంతటి తీవ్రమైన హెయిర్ ఫాల్ అయినా పరార్‌ అవ్వాల్సిందే.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/"/ ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసుకోవాలి.

అలాగే ఐదు బాదం పప్పులు వేసి మెత్త‌ని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక గ్లాస్ కొబ్బరి నూనె వేసుకోవాలి.

నూనె హీట్ అవ్వడానికి ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న‌ పొడిని వేసి చిన్న మంటపై ఎనిమిది నుంచి ప‌ది నిమిషాల పాటు గరిటతో తిప్పుకుంటూ ఉడికించాలి.

"""/"/ ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

పురుషుల్లో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఈ ఆయిల్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

రెండు రోజులకు ఒకసారి నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను తలకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.

మరుసటి రోజు హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా కనుక చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారి రాలడం తగ్గుతుంది.

అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.

కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అయ్యే పురుషులు తప్పకుండా ఈ ఆయిల్ ను వాడేందుకు ప్రయత్నించండి.

మణిపూర్ : భారత సంతతి ప్రొఫెసర్‌పై కేసు నమోదు.. ఖండించిన కుకీ విద్యార్ధి సంఘం