స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్ కి సహాయపడే నేచురల్ బ్లీచ్ ఇది.. తప్పకుండా ట్రై చేయండి!

స్కిన్ బ్లీచింగ్‌.దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చర్మాన్ని తెల్లబరచడం లేదా చర్మపు మెరుపును పెంచే ప్రక్రియను స్కిన్ బ్లీచింగ్ అని అంటారు.

స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్ కోసం చాలా మంది బ్యూటీ పార్లర్ కు వెళ్లి తరచూ బ్లీచింగ్ చేయించుకుంటారు.

మరికొందరు మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ బ్లీచింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.కానీ, ఈ రెండు పద్ధతులు చర్మ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.

అందుకే సహజ పద్ధతుల్లో స్కిన్ బ్లీచింగ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీ నేచురల్ బ్లీచ్ లాగా పనిచేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక టమాటో ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ ను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, హాఫ్‌ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/"/ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

అనంతరం మరో ప‌ది నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు వాట‌ర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

స‌హజ పద్ధతుల్లో చర్మాన్ని బ్లీచ్ చేయడానికి ఈ రెమెడీ ఎంత ఉత్తమంగా సహాయపడుతుంది.

"""/"/ ఈ రెమెడీని తరచూ పాటిస్తే చర్మం సహజంగానే వైట్ గా, బ్రైట్ గా మారుతుంది.

పైగా చర్మంపై ముడతలు ఏమైనా ఉంటే క్రమంగా మాయమవుతాయి.వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.

మరియు ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా మెరుస్తుంది.కాబట్టి స్కిన్ ను వైట్ గా బ్రైట్ గా మెరిపించుకోవాలని ఆరాటపడేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.