మధుమేహం నుంచి మలబద్ధకం వరకు ఎన్నిటికో చెక్ పెట్టే మ్యాజికల్ డ్రింక్ ఇది.. డోంట్ మిస్!
TeluguStop.com
ఇటీవల రోజుల్లో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో మధుమేహం బాధితులు ఉంటున్నారు.
అయితే మధుమేహం ( Diabetes )వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ మధుమేహం నుంచి మలబద్ధకం వరకు ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక గ్లాసు తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ), వన్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాలు వేసుకోవాలి.
ఆ తర్వాత గ్లాసు నిండేలా వాటర్ పోసుకుని మూత పెట్టి నైట్ అంతా వదిలేయాలి.
మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న మెంతులు, ధనియాలు, లవంగాలను వాటర్ తో సహా వేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.
"""/" /
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే.
మన డ్రింక్ సిద్ధం అయినట్టే.ఈ డ్రింక్ ను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
ప్రతిరోజు ఈ మ్యాజికల్ డ్రింక్ ను కనుక తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.అలాగే చాలా మంది మలబద్ధకంతో బాధ పడుతుంటారు.
అలాంటి వారికి ఈ డ్రింక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది. """/" /
రోజు ఈ డ్రింక్ ను తాగితే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.
మలబద్ధకం సమస్య పరార్ అవుతుంది.అంతే కాదండోయ్ రెగ్యులర్ డైట్ లో ఈ డ్రింక్ ఉంటే వెయిట్ లాస్ అవుతారు.
మహిళల్లో థైరాయిడ్ పీసీఓడీ ( Thyroid Problem )వంటివి తలెత్తకుండా ఉంటాయి.నెలసరి సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.
బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.
రక్తపోటు అదుపులో ఉంటుంది.మరియు మోకాళ్ళ నొప్పుల నుంచి సైతం విముక్తి లభిస్తుంది.
చైనా అమ్మాయి మనసు బంగారం.. తమిళనాడు వ్యాపారవేత్తకు రూ.30 లక్షల కారు బహుమతి..