కళ్ళ చుట్టూ నలుపును మాయం చేసే మ్యాజికల్ క్రీమ్ ఇది.. తప్పకుండా ట్రై చేయండి!

సాధారణంగా కొందరికి కళ్ళ చుట్టూ ఉండే చర్మం నల్లగా మారుతుంటుంది.నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలు అనేకం.

ముఖ్యంగా ఒత్తిడి, కంటి నిండా నిద్ర‌ లేకపోవడం, స్మార్ట్ ఫోన్ ను గంటలు తరబడి చూడటం, పలు రకాల మందుల వాడకం, హార్మోన్ల అసమతుల్యత వంటివి నల్లటి వలయాలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

అయితే ఏదేమైనా నల్లటి వలయాలు ఏర్పడటం వల్ల ముఖంలో క‌ళ తపుతుంది.ఈ క్రమంలోనే నల్లటి వలయాలను వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ మేడ్ క్రీమ్ ను కనుక వాడితే కళ్ళ చుట్టూ నలుపు కొద్ది రోజుల్లోనే మాయమవుతుంది.

సహజంగానే నల్లటి వలయాలకు బై బై చెప్పవచ్చు.మ‌రి ఇంత‌కీ ఆ మ్యాజికల్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుదీనా ఆకులు, పావు కప్పు ఫ్రెష్ లెమన్ పీల్, నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/"/ ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.

అలాగే పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ మరియు నాలుగు టేబుల్ స్పూన్లు తయారు చేసి పెట్టుకున్న జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే మన క్రీమ్ సిద్ధమవుతుంది.

"""/"/ ఈ క్రీమ్‌ ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసి స్మూత్ గా వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి.

ఇలా ప్రతిరోజు కనుక చేస్తే కళ్ళ చుట్టూ డార్క్ గా మారిన చర్మం కొద్ది రోజుల్లోనే వైట్ గా మారుతుంది.

న‌ల్ల‌టి వ‌ల‌యాలు న్యాచుర‌ల్ గా దూరం అవుతాయి.పైగా కళ్ళ వద్ద ముడతలు ఏమైనా ఉన్నా సరే క్రమంగా మాయమవుతాయి.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలనే రిజెక్ట్ చేసిన ముగ్గురు ప్రముఖ సెలబ్రిటీలు వీళ్లే!