గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధులకు దూరంగా ఉంచే హెల్తీ స్మూతీ ఇది.. డోంట్ మిస్‌!

ఇటీవల కాలంలో కోట్లాది మందిని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో మధుమేహం ఒకటి.అలాగే ప్రతి ఏడాది గుండెపోటు సమస్యతో మరణిస్తున్న వారి సంఖ్య సైతం అంతకంతకు పెరిగిపోతోంది.

అయితే ఈ రెండు సమస్యలను అడ్డుకోవడంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడుతుంటాయి.

అటు వంటి ఆహారాల్లో ఇప్పుడు చెప్పబోయే స్మూతీ ఒకటి.ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

మరి ఇంతకీ ఆ స్మూతీ ఏంటి.దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.

మరియు ఎప్పుడు తీసుకోవాలి.వంటి విషయాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్, ఒక కప్పు వాటర్ వేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి.

అనంతరం బ్లెండర్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ చియా విత్తనాలు వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు పీల్ తొలగించి కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, అర కప్పు సీడ్ లెస్ బ్లాక్ గ్రేప్స్, అర కప్పు దానిమ్మ గింజలు, నాలుగు నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకున్న జీడిపప్పు, నానబెట్టుకున్న ఓట్స్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ స్మూతీ సిద్ధమవుతుంది.

"""/"/ ఈ స్మూతీని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో లేదా నైట్ డిన్నర్ లో అయినా తీసుకోవచ్చు.

ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ క‌రిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

దీంతో గుండె పోటు తో సహా వివిధ రకాల గుండె వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.

వెయిట్ లాస్ అవుతారు.మరియు ఎముకలు, కండరాలు దృఢంగా సైతం మారతాయి.

కాబట్టి తప్పకుండా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

బిగ్ బాస్ షో సీజన్ 8లో తెలుగు వాళ్లకు అన్యాయం జరిగిందా.. వాళ్లకే ఛాన్స్ ఇచ్చారా?