ప‌వ‌న్ కి ఇదే మంచి అవ‌కాశం.. ఆ పార్టీల నేత‌ల ఇంట్రెస్ట్..!!

జ‌న‌సేన పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్ చార్జులు లేరంటే ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

2014 లో పార్టీ పెట్టిన‌ప్ప‌టికీ ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేయ‌లేదు.టీడీపీ- బీజేనీ కూట‌మికి మ‌ద్ద‌తు తెలిపారు.

ప్ర‌చారం కూడా చేశారు.కానీ 2019 ఇరు పార్టీల‌తో విభేదించి నేరుగా పోటీ చేసినా ఓట‌మిపాల‌య్యారు.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన పార్టీలో చెప్పుకోద‌గ్గ నేత‌లు ఎవ‌రూ కూడా చేర‌లేద‌నే చెప్పాలి.

కానీ ఏపీలో మారుతున్న ప‌రిస్థితుల దృష్ట్యా ఇప్పుడు జ‌న‌సేన‌లోకి చేరిక‌లు ఊపందుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇక ప‌వ‌న్ కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్తూ ఓ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇక వెల్లువలా పవన్ పార్టీలోకి చేరికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయిట.ఏపీలో ఇపుడున్న రాజకీయ పరిస్థితులే జనసేనకు కలసివస్తున్నాయని అంటున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆందోళ‌న‌.!అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూడా ఒకే విధమైన పద్ధతిని అనుసరించబోతున్నాయి.

ఏపీలో చూస్తే జగన్ పనిచేయని ఎమ్మెల్యేలకు టికెట్లు లేవు అని చెప్పేస్తున్నారు.మరి ఆయన వద్ద నివేదికలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఈ రోజున పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళ‌న చెందేలా వర్క్ షాప్ లో జ‌గ‌న్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.

దీంతో పనితీరుకు కొలమానం ఏంటో తెలియక చాలా మంది ఇక తమకు టికెట్ క‌ష్‌ట‌మే అని డిసైడ్ అవుతున్నార‌ట.

వారంతా ఇపుడు పక్క చూపులు చూస్తున్నార‌ని అంటున్నారు.ముఖ్యంగా వైసీపీలో ఈసారి కనీసంగా నలభై నుంచి యాభై మందికి టికెట్లు దక్కవని అంటున్నారు.

దీంతో అనుమానం ఉన్న వాళ్లు ఇపుడు జనసేన వైపు చూస్తున్నారని స‌మాచారం.ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఈ తాకిడి ఎక్కువగా ఉంది అని అంటున్నారు.

వైసీపీ విషయం తీసుకున్నా పార్టీ పరిస్థితి కాస్తా నెమ్మదించినది కూడా గోదావరి కోస్తా జిల్లాలలో కావడంతో అక్కడే ఎక్కువ మందికి టికెట్లు రావు అని అంటున్నారు.

దాంతో ముందు జాగ్రత్త పడుతున్న వారు కొత్త పార్టీగా జనసేన వైపు చూస్తున్నార‌ట‌.

అదే విధంగా కోస్తా ప్రాంతాలలో అయితే టీడీపీని కూడా చాయిస్ గా తీసుకుంటున్నారు అని అంటున్నారు.

టీడీపీ నుంచి కూడా మరో వైపు టీడీపీలో కూడా ఇలాంటి పరిస్థితే కొన్ని చోట్ల ఉంది.

సీనియర్ నేతలను కొన్ని చోట్ల పక్కన పెట్టాలని పార్టీ ఆలోచిస్తోంది.అదే విధంగా మూడేళ్లుగా పార్టీ కోసం పనిచేయని వారు వద్ద‌నే చెబుతోంది.

దాంతో వారు కూడా తట్టా బుట్టా సర్దుకోవడానికి రెడీ అవుతున్నారు.అలా కనుక చూస్తే ఉత్తరాంధ్రా రాయలసీమలలో ఎక్కువ మంది టీడీపీ నుంచి జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

అలా చిత్తూరు, కర్నూల్, కడప వంటి చోట్ల టీడీపీ మాజీలు చాలా మంది జనసేన వైపు చూస్తున్నారుట.

అలాగే ఉత్తరాంధ్రా జిల్లాలలో సీనియర్ నేతలు జనసేన బెటర్ అని భావిస్తున్నారుట. """/" / జ‌న‌సేన ఇంట్రెస్ట్ గా ఉంది ఈ పరిణామాల నేపథ్యంలోనే మంగళగిరి పార్టీ ఆఫీసులో తాజాగా జరిగిన జనసేన రాజకీయ వ్యవాహరాల కమిటీ మీటింగ్ లో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కూడా ఆలోచించారని అంటున్నారు.

అలాగే పవన్ కల్యాణ్ పార్టీలో కోవర్టులు ఉండ‌కూడ‌ద‌ని పిలుపు ఇచ్చారని అంటున్నారు.ఈ క్ర‌మంలో పార్టీలో చేరేవారికి వెల్ క‌మ్ చేప్ప‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు సంకేతాలు ఇస్తున్నారు.

దీంతో జ‌న‌సేన పార్టీ ప‌టిష్ట‌మవుతుంద‌ని భావిస్తున్నారు.

స్టార్ హీరో బాలయ్య ఫిట్ నెస్ సీక్రెట్ ఇదేనా.. ఆ ఫుడ్ మాత్రమే ఇష్టంగా తింటారా?