కిషన్ రెడ్డికి ఇది సవాలే ! ఆ విషయంలో సక్సెస్ అవుతారా ?

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి( Minister Kishan Reddy ) కి బాధ్యతలు అప్పగిస్తూ బిజెపి నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగిన బండి సంజయ్( Bandi Sanjay ) ను వివిధ కారణాలతో అధ్యక్ష పదవి నుంచి తప్పించారు.

వచ్చే ఎన్నికల్లో సంజయ్ సారధ్యంలో ఎన్నికలకు వెళ్తే, పార్టీకి ఓటమి తప్పదనే సంకేతాలతో ఆయనను తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

తెలంగాణ బిజెపిలో సీనియర్ నాయకుడిగా ఉన్న కిషన్ రెడ్డి అధిష్టానం పెద్దలకు నమ్మకస్తుడిగా, అందరిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లగలిగిన వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది.

ఆ కారణాలతోనే ఆయనకు అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.అయితే ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు సమయం మాత్రమే ఉండడంతో, కిషన్ రెడ్డి ఇంత తక్కువ సమయంలో పార్టీని ప్రక్షాళన చేయగలరా ? నాయకులు మధ్య సమన్వయం కుదర్చగలరా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో మొన్నటి వరకు బిజెపి పేరు మారుమోగినా, ఇప్పుడు ఆ స్థానాన్ని కాంగ్రెస్( Congress ) ఆక్రమించిందనే సంకేతాలు వెలబడ్డాయి.

దీనికి కారణం పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాలు, పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడం వంటివన్నీ కారణం అయ్యాయి.

దీంతో ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి ఇంత తక్కువ సమయంలో నాయకుల మధ్య సమన్వయం కుదర్చగలరా, అందరీని ఏకతాటిపైకి తీసుకురాగలరా అనేది తేలాల్సి ఉంది.

ఈ ఏడాది చివరిలో తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి.పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

"""/" / అసంతృప్త నేతలు బహిరంగంగానే సొంత నేతలపై విమర్శలు చేస్తున్నారు .

జితేందర్ రెడ్డి, రఘునందన్ రావు ( Jitender Reddy, Raghunandan Rao )వంటి వారు చేస్తున్న విమర్శలు పార్టీకి డామేజ్ చేస్తున్నాయి.

ఇక ఈ మధ్యకాలంలో బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ వంటి వారు అసంతృప్తితో ఉన్నారు.

ఇటువంటి నేతలు అందరిని బుజ్జగించి, సమన్వయం చేసుకుని ముందుకు తీసుకువెళ్లే విధంగా కిషన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఇప్పటికే రెండుసార్లు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

సౌమ్యరుగా హుందాగా నడుచుకుంటారనే పేరు ఉంది. """/" / అయితే దూకుడుగా వ్యవహరించాల్సిన సమయంలోను కిషన్ రెడ్డి ఆ విధంగా ముందుకు వెళ్ళలేకపోవడం వంటివి ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిణామాలతో పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు ముందుగా విముఖత వ్యక్తం చేసినా, బీజేపీ హై కమాండ్ పెద్దల ఒత్తిడితో అంగీకరించారట.

ఇప్పుడు తెలంగాణ బిజెపి లో పరిస్థితులను చక్కదిద్ది, అసంతృప్తులను బుజ్జగించి, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లేలా కిషన్ రెడ్డి పనిచేయాల్సి ఉంటుంది.