హెయిర్ గ్రోత్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారా? అయితే ఈ రెమెడీ మీకోస‌మే!

ప్ర‌స్తుత రోజుల్లో హెయిర్ ఫాల్ వ‌ల్ల మాత్ర‌మే కాదు హెయిర్ గ్రోత్ లేక‌పోవ‌డం వ‌ల్ల కూడా ఎంద‌రో స‌త‌మతం అవుతున్నారు.

హెయిర్ గ్రోత్ లేక‌పోతే.రోజు ఊడే వెంట్రుక‌లు ఊడ‌తాయి.

కానీ, కొత్త వెంట్రుక‌లు రావు.దాంతో ఒత్తుగా ఉండాల్సిన జుట్టు కాస్త ప‌ల్చ‌బ‌డిపోతుంది.

ఈ క్ర‌మంలోనే ఏం చేయాలో అర్థంగాక‌, హెయిర్ గ్రోత్‌ను ఎలా పెంచుకోవాలో తెలియ‌క తెగ మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.

ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే ప‌ల్చ‌బ‌డిన మీ జుట్టు మ‌ళ్లీ ఒత్తుగా మారుతుంది.

మ‌రి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక బౌల్‌లో క‌ప్పు పెస‌లు, అర క‌ప్పు మెంతులు తీసుకుని వాట‌ర్‌తో రెండు సార్లు క‌డ‌గాలి.

ఆ త‌ర్వాత రెండు, మూడు గ్లాసుల వాట‌ర్ పోసి నైటంతా నాన‌బెట్టుకోవాలి.ఉద‌యాన్నే వాట‌ర్‌ను పూర్తిగా తొల‌గించి.

నాన‌బెట్టుకున్న పెస‌లు, మెంతుల‌ను శుభ్ర‌మైన వ‌స్త్రంలో వేసి మూట‌గ‌ట్టి గాలి చొర‌బ‌డ‌ని చోట పెడితే ఒక‌టి నుంచి రెండు రోజుల్లో మొల‌క‌లు వ‌స్తాయి.

"""/"/ అలా మొల‌కెత్తిన పెస‌లు, మెంతుల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసుకోవాలి.అలాగే క‌ల‌బంద ఆకును తీసుకుని పీల్ తొల‌గించి మిక్సీ జార్‌లో వేసుకోవాలి.

ఆపై మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం వేసుకుని అన్నిటినీ మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మంలో వ‌న్ ఎగ్ వైట్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు త‌యారు చేసుకున్న‌ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

గంట అనంత‌రం మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక‌సారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ అద్భుతంగా పెరుగుతుంది.

దేవర తెలుగు రాష్ట్రాల హక్కులు మరీ అంత తక్కువా.. ఘోరమంటూ?