హెయిర్ ఫాల్ ఎంత అధికంగా ఉన్న ఈజీగా ఈ ఆయిల్ తో చెక్ పెట్టొచ్చు.. తెలుసా?

సాధారణంగా కొందరిలో హెయిర్ ఫాల్( Hairfall ) అనేది చాలా అధికంగా ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.కొందరైతే హెయిల్ ఫాల్ ను వదిలించుకునేందుకు మందులు కూడా వాడుతుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది.

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడారంటే హెయిర్ ఫాల్ ఎంత అధికంగా ఉన్న ఈజీగా చెక్ పెట్టవచ్చు.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి నీటితో కడిగి అవి మునిగేలా వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు వాటర్ ను తొలగించి మెంతులను ఒక క్లాత్ లో మూటకట్టి రెండు రోజులపాటు పక్కన పెట్టాలి.

దాంతో మెంతులు చక్కగా మొలకెత్తుతాయి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మొలకెత్తిన మెంతులు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు,( Onions ) రెండు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఆ తర్వాత కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె పోసుకోవాలి.

అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమంతో పాటు నాలుగు లవంగాలు వేసి దాదాపు పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

దాంతో మన ఆయిల్ అనేది రెడీ అవుతుంది.స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక క్లాత్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

ఇక ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మంచిగా మసాజ్ చేసుకోవాలి.

"""/" / ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల అనంతరం తేలిక పాటి షాంపూను ఉపయోగించి తలస్నానం చేయవచ్చు.

వారానికి కనీసం రెండుసార్లు ఈ ఆయిల్ ను కనుక తలకు పట్టించారంటే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.

హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా కంట్రోల్ అవుతుంది.అలాగే ఈ ఆయిల్ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఊడిన జుట్టును మళ్ళీ మొలిపిస్తుంది.కురులను దట్టంగా మారుస్తుంది.

అలాగే ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.

మరియు హెయిర్ బ్రేకేజ్ సమస్య సైతం దూరం అవుతుంది.