మొటిమలు అందాన్ని పాడు చేస్తున్నాయా.. అయితే ఈ క్రీమ్ మీకోసమే!

అందాన్ని పాడు చేయడంలో మొటిమలు ( Pimples )ముందు వరుసలో ఉంటాయి.సీజన్ తో పని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మొటిమలు మనశ్శాంతిని దూరం చేస్తుంటాయి.

ముఖ్యంగా మగువలు మొటిమల వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.ముఖంపై ఒక్క మొటిమ కనిపించినా చాలు తెగ బాధపడిపోతూ ఉంటారు.

ఇక‌పోతే కొందరిలో మొటిమలు చాలా త్వరగా తగ్గిపోతాయి.కానీ కొందరిలో మాత్రం ఓ పట్టాన పోవు.

దీంతో వాటిని వదిలించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. """/" / అయితే మీరు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ ను కనుక వాడితే మొటిమలు మ‌ళ్లీ మీ వంక కూడా చూడవు.

మరి లేటెందుకు ఆ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ వేపాకు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు కొబ్బరి నూనె( Coconut Oil )వేసుకోవాలి.

ఆయిల్ హీట్ అవ్వగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపాకు వేసి పది నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి.

"""/" / ఆ త‌ర్వాత‌ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మరో ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ లో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloe Vera Gel )వేసుకోవాలి.

అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు వేప నూనె, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

రోజూ ఇలా చేస్తే ఎలాంటి మొండి మొటిమలు అయినా సరే దెబ్బకు పరార్ అవుతాయి.

మొటిమల తాలూకు మచ్చలు సైతం మాయం అవుతాయి.అలాగే చలికాలంలో చాలామంది డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతుంటారు.

అలాంటి వారికి కూడా ఈ క్రీమ్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

అవి మహిళల కనీస అవసరాలు.. ఆ రిపోర్ట్ పై సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్!