యంగ్ ఏజ్ లోనే వైట్ హెయిర్ వచ్చేసిందా.. వర్రీ అవ్వకుండా ఈ రెమెడీని ట్రై చేయండి!
TeluguStop.com
ఇటీవల రోజుల్లో యంగ్ ఏజ్ లోనే వైట్ హెయిర్ సమస్యను ఫేస్ చేస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.
ఒత్తిడి, పెరిగిన కాలుష్యం, రసాయనాలతో కూడిన కేశ ఉత్పత్తులను వాడటం, పోషకాల కొరత తదితర అంశాలు జుట్టు తెల్లబడటానికి కారణం అవుతుంటాయి.
ఏదేమైనా తలలో తెల్ల వెంట్రుకలు(white Hair) కనిపించగానే ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది.
కానీ వర్రీ అవ్వకండి.డైయింగ్ తో పని లేకుండా సహజంగానే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా మీకు సహాయపడుతుంది.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్(Coffee Powder), వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్(TEE Powder ), వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్(Kalonji Seeds) వేసుకోవాలి.
అలాగే మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బీట్ రూట్(Beetroot) తురుము వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్( Henna Powder), రెండు టేబుల్ స్పూన్లు పెరుగు(Curd ) వేసుకొని కలుపుకోవాలి.
చివరిగా తయారు చేసి పెట్టుకున్న వాటర్ ను కొంచెం కొంచెం గా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని గంటపాటు పక్కన పెట్టి ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.
"""/" /
గంట సేపు షవర్ క్యాప్ ధరించి అనంతరం తేలిక పాటి షాంపూతో తలస్నానం చేయాలి.
కండిషనర్ ని కూడా తప్పకుండా ఉపయోగించాలి.వారానికి ఒక్కసారి ఈ ప్యాక్ ను వేసుకుంటే వైట్ హెయిర్ ప్రాబ్లంకు బై బై చెప్పవచ్చు.
ఈ రెమెడీ మీ తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మారుస్తుంది.అదే సమయంలో జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా తయారు చేస్తుంది.
జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది.మరియు కురులను షైనీ గా సైతం మెరిపిస్తుంది.
ఎంబీబీఎస్ అడ్మిషన్లు.. చెన్నైలో వెలుగు చూసిన నకిలీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్లు