ముఖంపై అసహ్యంగా కనిపించే బ్లాక్ హెడ్స్ కు ఈజీగా చెక్ పెట్టండిలా!
TeluguStop.com
బ్లాక్ హెడ్స్( Black Heads ).చాలా మందిని కలవరపాటుకు గురి చేసే చర్మ సమస్యల్లో ఒకటి.
బ్లాక్ హెడ్స్ అంటే చర్మంపై ఏర్పడే చిన్నపాటి నల్లని మచ్చలు.ముఖ్యంగా ముక్కు, నుదురు మరియు మృదువైన చర్మ భాగాల్లో బ్లాడ్ హెడ్స్ ఏర్పడతాయి.
అధిక సెబమ్ ఉత్పత్తి, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోవడం, హార్మోన్ మార్పులు, ధూళి, కాలుష్యం, మేకప్ ని సరిగ్గా క్లీన్ చేయకపోవడం, కాస్మెటిక్స్ మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్( Skin Care Products ) ఉపయోగించడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం తదితర అంశాలు బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి కారణం అవుతాయి.
"""/" /
అయితే బ్లాక్ హెడ్స్ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అరకప్పు వాటర్ వేసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon Juice )వేసుకోవాలి.
అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్( Sugar ), వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ( Coffee Powder )వేసి మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై చేతి వేళ్లకు కొంచెం కొబ్బరి నూనెను అప్లై చేసుకుని చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వేసుకున్న ప్యాక్ ను తొలగించాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీ ముసుకుపోయిన రంధ్రాలను తెరవడంతో పాటు మురికిని, చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.
చర్మం పై ఉన్న బ్లాక్ హెడ్స్ ను రిమూవ్ చేస్తుంది.సెబమ్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది.
చర్మానికి కొత్త మెరుపును జోడిస్తుంది.బ్లాక్ హెడ్స్ తో బాధపడుతున్న వారికి ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది.
వారానికి రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ నీ సొంతమవుతుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025