హెయిర్ ఫాల్ సూపర్ ఫాస్ట్ గా కంట్రోల్ అవ్వాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

జుట్టు రాలడం( Hair Fall ) అనేది అందరూ ఫేస్ చేసే కామన్ సమస్య.

కానీ కొంత మందిలో మాత్రం హెయిర్ ఫాల్ చాలా అధికంగా ఉంటుంది.ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టు కళ్ళ ముందే రాలిపోతుంటే చూసి తట్టుకోలేకపోతుంటారు.

ఈ క్రమంలోనే జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే హెయిర్ ఫాల్ ను సూపర్ ఫాస్ట్ గా కంట్రోల్ చేసే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఒకటి ఉంది.

వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" / ముందుగా ఒక కలబంద ఆకును( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి.

అలాగే ఒక ఫుల్ ఎగ్( Egg ) బ్రేక్ చేసి వేసుకోవాలి.చివరిగా గింజ తొలగించి సన్నగా తరిగిన ఒక ఉసిరికాయ( Amla ) కూడా వేసి చాలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ మాస్క్ ను కనుక వేసుకుంటే గుడ్డులో ఉండే ప్రోటీన్లు, కలబంద అలోవెరా లో ఉండే విటమిన్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడతాయి.అలాగే ఈ మాస్క్ పొడి జుట్టును నివారిస్తుంది.

జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.చాలామంది హెయిర్ బ్రేకేజ్ తో బాధపడుతుంటారు.

అయితే అలాంటి వారికి కూడా ఈ మాస్క్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఇది జుట్టు దృఢంగా మారుస్తుంది.

జుట్టు విరగడాన్ని చిట్లడాన్ని అడ్డుకుంటుంది.పైగా ఈ మాస్క్ వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల చుండ్రు సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు.