Lakshmi Lahari :చిరంజీవి మేనకోడలిగా నటించిన హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా?
TeluguStop.com
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ఒకటి రెండు సినిమాలలో నటించినప్పటికీ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటూ ఉంటారు.
నటించినది ఒకటి రెండు సినిమాలు అయినా కూడా ఎప్పటికీ ప్రేక్షకుల మనసులో చరగని ముద్రను వేసుకుంటూ ఉంటారు.
అలా చాలామంది సెలబ్రిటీలు ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత దూరమైన విషయం మనందరికీ తెలిసిందే.
ఆ తర్వాత వారిని చూసినప్పుడు మీకు ఎక్కడ ఉంది ఏం చేస్తుంది ఎందుకు సినిమాలలో నటించడం లేదు లాంటివి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది.
"""/" /
అటువంటి వారిలో లక్ష్మీ లహరి అలియాస్ లక్ష్మీ శర్మ( Lakshmi Lahari ) కూడా ఒకరు.
చాలామంది లక్ష్మీ లహరి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఇంద్ర సినిమా( Indra Movie )లో చిరంజీవి మేనకోడలు నందిని అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.
ఈ సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఆమె ఈ సినిమాతో పాటు తెలుగులో నటించినప్పటికీ సరైన విధంగా గుర్తింపు దక్కకపోవడంతో మలయాళ ఇండస్ట్రీకి చెక్కేసింది.
2000లో వచ్చిన అమ్మో ఒకటో తారీఖు సినిమాలో ఎల్బీ శ్రీరామ్ చిన్న కూతురుగా నటించింది.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది """/" /
.సారీ నాకు పెళ్లైంది, ఆరుగురు పతివ్రతలు( Aaruguru Pathivrathalu ) వంటి చిత్రాల్లో మెరిసింది.
తర్వాత మాలీవుడ్ కి వెళ్ళి అక్కడ మమ్ముట్టితో కలిసి పలన్కు అనే సినిమాలో నటించింది.
ఆ తర్వాత ఆమె వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.అక్కడ వరుస హిట్లతో టాప్ హీరోయిన్‌గా మారిపోయింది.
ఒకానొక సమయంలో అవకాశాల కోసం పలు అండర్ రేటెడ్ చిత్రాల్లో కూడా నటించింది.
అలా మలయాళంలో దూసుకెళుతూ ఇప్పటికీ నటిస్తూనే ఉంది.అలాగే తెలుగు, మలయాళంలో భక్తి కథ సీరియల్స్ లోనూ నటించింది.
ప్రస్తుతం ఆమె కొన్ని ప్రత్యేకమైన క్యారెకర్ లలో కనిపిస్తోంది.మలయాళ స్టార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ నుండి రాబోతున్న ఆడుజీవితం సినిమాలో ఆమె కూడా నటించింది.
ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా, అంచనాలు పెంచేశాయి.పొట్టకూటి కోసం సౌదీకి వెళ్లే భారతీయలు ఎన్నికష్టాలు పడుతున్నారో ఈ సినిమాలో చూపించనున్నారు.
ఈ చిత్రం ఈ అక్టోబర్‌లో విడుదల కానుంది.