అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!

ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అధిక బరువు( Overweight ) సమస్యతో బాధపడుతున్నారు.

వేళకు ఆహారం తీసుకోకపోవడం, ఏది పడితే అది లిమిట్ లేకుండా తినేయడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఒత్తిడి, పలు రకాల మందులు వాడకం, మద్యపానం, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల శరీర బరువు అనేది అదుపు తప్పుతుంది.

అధిక బరువు అనేక రోగాలకు మూలం.అందువల్ల బరువును అదుపులోకి తెచ్చుకోవడం ఎంతో అవసరం.

మీరు కూడా అధిక బరువుతో వర్రీ అవుతున్నారా.? అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ వాటర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెర్బల్ వాటర్( Herbal Water ) ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక గ్రీన్ యాపిల్ ( Green Apple )ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక నిమ్మ పండును( Lemon Fruit ) కూడా తీసుకొని వాటర్ తో వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

"""/" / వాటర్ హీట్‌ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి.

మరియు అంగుళం దాల్చిన చెక్కను( Cinnamon ) కూడా వేసి దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.నిత్యం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ హెర్బల్ వాటర్ ను తీసుకుంటే అద్భుత ఫలితాలు పొందుతారు.

"""/" / ఈ హెర్బల్ వాటర్ మెటబాలిజం రేటును పెంచుతుంది.శరీరంలో కేలరీలు వేగంగా బర్న్ అయ్యేలా ప్రోత్సహిస్తుంది.

వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.బరువు తగ్గాలని భావిస్తున్న వారికి ఈ హెర్బల్ వాటర్ ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.

అలాగే బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి కూడా ఈ హెర్బల్ వాటర్ తోడ్పడ‌తాయి.

నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే పొట్ట చుట్టూ కొవ్వు ఐసు ముక్కలా కరిగిపోతుంది.