పొట్ట కొవ్వును కరిగించే గ్రీన్ యాపిల్.. ఎలా తీసుకోవాలంటే..?

పొట్ట చుట్టూ కొవ్వు( Stomach Fat ) భారీగా పేరుకుపోయిందా.? పొట్ట కొవ్వు కారణంగా మీ బాడీ షేప్ అవుట్ అయిందా.

? అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోలేకపోతున్నారా.? అయితే అస్సలు దిగులు చెందకండి.

నిజానికి పొట్ట కొవ్వును కరిగించడానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.

అందులో గ్రీన్ ఆపిల్( Green Apple ) కూడా ఒకటి.గ్రీన్ ఆపిల్ తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ కలిగిన పండు.

అందువల్ల బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో గ్రీన్ ఆపిల్ మీకు చక్కగా తోడ్పడుతుంది.

అందుకోసం గ్రీన్ ఆపిల్ ను ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గ్రీన్ ఆపిల్ ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే అంగుళం అల్లం ముక్క( Ginger ) మరియు ఒక చిన్న నిమ్మకాయను( Lemon ) కూడా తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు, అల్లం ముక్కలు మరియు నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి.

చివరిగా ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. """/" / ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైన‌ర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ గ్రీన్ ఆపిల్ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి నేరుగా సేవించాలి.

బెల్లి ఫ్యాట్ తో బాధపడేవారు మ‌రియు అధిక బరువుతో( Obesity ) సతమతం అవుతున్న‌వారు ఈ గ్రీన్ ఆపిల్ జ్యూస్ ను రెగ్యులర్ గా క‌నుక తీసుకుంటే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

"""/" / ఈ జ్యూస్ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా ఎఫెక్ట్ గా సహాయపడుతుంది.

నిత్యం ఈ జ్యూస్ ను తాగితే కొద్ది రోజుల్లోనే మీ బాన పొట్ట ఫ్లాట్ గా నాజూగ్గా మారుతుంది.

అదే సమయంలో వెయిట్ లాస్ అవుతారు.శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు తొలగిపోతాయి.

బాడీ డీటాక్స్ అవుతుంది.స్కిన్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.

అదే సమయంలో మధుమేహం, గుండె జ‌బ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.

మమ్మల్ని వేధిస్తున్నారు … సభలో కేటీఆర్ ఫైర్