ముఖం య‌వ్వ‌నంగా క‌నిపించాలా? అయితే ఈ ఫేస్‌ప్యాక్ ట్రై చేయండి!

ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్ సీజ‌న్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ కాలంలో విరి విరిగా ల‌భించే పండ్ల‌లో మామిడి పండ్లు ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

పిల్ల‌లు, పెద్ద‌లు అన్న తేడా లేకుండా అంద‌రూ అమితంగా ఇష్ట‌ప‌డి తినే మామిడి పండ్లు అద్భుత‌మైన రుచితో పాటు ఎన్నో పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉంటాయి.

అందుకే ఇవి ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.అలాగే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంపొందిస్తాయి.

ముఖ్యంగా మామిడి పండ్ల‌తో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా ఫేస్ ప్యాక్‌ను వేసుకుంటే ముఖాన్ని య‌వ్వ‌నంగా మ‌రియు కాంతివంతంగా మెరిపించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు మామిడి పండ్ల‌తో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

మొద‌ట దోర‌గా పండిన మామిడి పండును తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి పీల్ తొల‌గించి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే ఈ ప్యాక్ కోసం మామిడి పండుతో పాటు అవ‌కాడో పండు కూడా అవ‌స‌రం.

ఒక అవ‌కాడోను తీసుకుని స‌గానికి క‌ట్ చేసి గింజ తొల‌గించి దానిలో ఉన్న గుజ్జును స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్క‌లు, స‌ప‌రేట్ చేసిన అవ‌కాడో పండు గుజ్జు, నాలుగు టేబుల్ స్పూన్ల కాచి చ‌ల్లార్చిన పాలు వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో వ‌న్ టేబుల్ స్పూన్ తేనె యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్రెష్ సాయంతో ముఖానికి, మెడ‌కు అప్లై చేసుకుని ముప్పై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.

"""/" / పూర్తిగా డ్రై అయిన అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో చ‌ర్మాన్ని శుభ్రం చేసుకుని ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవాలి.

ఈ ఫేస్ ప్యాక్‌ను రెండు రోజుల‌కు ఒక‌సారి వేసుకుంటే చ‌ర్మంపై ముడ‌త‌లు, స‌న్న‌ని చార‌లు పోయి ముఖం య‌వ్వ‌నంగా, ప్ర‌కాశవంతంగా మారుతుంది.

చ‌ర్మంపై ఎలాంటి మ‌చ్చ‌లు ఉన్నా క్ర‌మంగా త‌గ్గుతాయి.మ‌రియు స‌మ్మ‌ర్ లో వేధించే ట్యాన్ స‌మ‌స్య నుంచి సైతం ఈ ఫేస్ ప్యాక్ విముక్తిని క‌లిగిస్తుంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ వస్తుందా.. ఈ కాంబోలో సీక్వెల్ వస్తే హిట్ అంటూ?