ఏపీలో ఈ ఎన్నికల్లో జగన్ కు కష్టమేనా.. వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయిగా!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎన్నికలలో వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కేవలం అభివృద్ధిపై ఫోకస్ పెడితే వైసీపీ ఎలా గెలుస్తుందని టీడీపీ నేతలతో పాటు ప్రశాంత్ కిషోర్( Prasanth Kishore ) సైతం కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే సామాన్య ప్రజల ఆలోచనా శైలి మాత్రం మరో విధంగా ఉంది.గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని స్థాయిలో సంక్షేమ పథకాలను జగన్( CM Jagan ) అందించారని సామాన్యులు చెబుతున్నారు.
"""/" /
చంద్రబాబు( Chandrababu ) పాలనతో పోల్చి చూస్తే వైసీపీ పాలన ఎన్నో రెట్లు బెటర్ అని మహిళలలో ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ గెలిచే పరిస్థితి లేకపోతే టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బయట జరుగుతున్న ప్రచారానికి వాస్తవాలకు ఏ మాత్రం పొంతన లేదని తెలుస్తోంది.కావాలనే జగన్ ను టార్గెట్ చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్ లో వైసీపీకి అనుకూలంగానే పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది.
"""/" /
ఉత్తరాంధ్రలోని జిల్లాలలో, రాయలసీమలోని జిల్లాలలో కూటమితో పోలిస్తే వైసీపీ పాలన వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
అర్బన్ ఓటర్లలో( Urban Voters ) కొంత వ్యతిరేకత ఉన్నా ఎన్నికల సమయానికి ఆ వ్యతిరేకతను సైతం అధిగమిస్తామనే భావన వైసీపీలో ఉంది.
జగన్ బహిరంగ సభలకు సైతం సైతం ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఏ మాత్రం గ్యాప్ లేకుండా జగన్ ప్రణాళికలకు అనుగుణంగా ప్రచారం చేస్తున్నారు. """/" /
టీడీపీ కూటమికి( TDP Alliance ) కూడా కొన్ని ప్రాంతాలలో మాత్రం అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమికి తిరుగులేదని తెలుస్తోంది.ప్రస్తుతానికి మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన సీట్లు సాధించడం వైసీపీకే సులువని సమాచారం అందుతోంది.
కూటమి వైసీపీపై విమర్శలు మానేసి కష్టపడితే మరింత మెరుగైన ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సమంతతో నాకు వర్క్ అవుట్ అవ్వలేదు.. నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు!