Egg Mask : వారానికి ఒక్కసారి ఈ ఎగ్ మాస్క్ ను వేసుకుంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు!

గుడ్డు( Egg ) ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహారాల్లో ఒకటి.పోషకాలకు పరంగా గుడ్డుకు మరొకటి సాటి లేదు.

అందుకే నిపుణులు రోజుకు ఒక ఉడికించిన గుడ్డు తీసుకోమని చెబుతుంటారు.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు సైతం గుడ్డు ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా హెయిర్ ఫాల్ ను అరికట్టడానికి గుడ్డు లో ఉండే పోషకాలు అద్భుతంగా తోడ్పడతాయి.

వారానికి ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే విధంగా ఎగ్ మాస్క్ వేసుకుంటే హెయిర్ ఫాల్ అన్న మాట అనరు.

మరి లేటెందుకు ఆ ఎగ్ మాస్క్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ ను పగలగొట్టి వేసుకుని బీట్ చేసుకోవాలి.

ఆ తర్వాత అందులో అర కప్పు పచ్చి పాలు, రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్( Olive Oil ) మరియు వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని మరోసారి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన హెయిర్ మాస్క్ అనేది సిద్ధమవుతుంది.తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / 40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల చాలా లాభాలు పొందుతారు.

పాలు మరియు గుడ్డులో ప్రోటీన్‌తో సహా జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

వీటిని ఉపయోగించి హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.

కుదుళ్ళ నుంచి కురులు స్ట్రాంగ్ గా మారతాయి.ఫలితంగా హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.పైగా ఈ హెయిర్ మాస్కో జుట్టును హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

హెయిర్ బ్రేకేజ్‌ను త‌గ్గిస్తుంది.కాబట్టి జుట్టు రాలుతుంద‌ని బాధపడుతున్న వారు వర్రీ అవ్వడం మానేసి ఈ ఎగ్ హెయిర్ మాస్క్ ను ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

ప్రభాస్ ను లైన్ లో పెడుతున్న్న స్టార్ డైరెక్టర్స్…వర్కౌట్ అవుతుందా..?