చలికాలంలో ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మీ జుట్టు ఊడమన్న ఊడదు!
TeluguStop.com
చలికాలంలో( Winter ) వచ్చే కొన్ని మార్పుల కారణంగా చాలా మంది అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు.
ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టు రోజూ ఊడిపోతుంటే చూసి సహించలేకపోతుంటారు.జుట్టు రాలడాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఆరాటపడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ రెమెడీని కనుక పాటిస్తే మీ జుట్టు ఊడమన్న ఊడదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి( Besan Flour ) వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ బాదం పౌడర్( Almond Powder ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకుని రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి.
చివరిగా ఒక ఎగ్ వైట్ ను కూడా వేసి మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
"""/" /
ముప్పై నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ ( Hair Mask )ను కనుక వేసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.
ముఖ్యంగా ఈ మాస్క్ జుట్టు రాలడాన్ని చాలా వేగంగా మరియు సమర్థవంతంగా అరికడుతుంది.
హెయిర్ రూట్స్ ను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తుంది.అలాగే ఈ మాస్క్ ద్వారా మీ జుట్టుకు విటమిన్ ఎ, విటమిన్ ఇ మరియు విటమిన్ బి అందుతాయి.
ఇవి జుట్టు వేగంగా మరియు బలంగా పెరగడానికి సహాయపడతాయి. """/" /
గుడ్డు, బాదం లో ఉండే ప్రోటీన్లు మరియు ఫ్యాట్స్ హెయిర్ అండ్ స్కాల్ప్ ను తేమగా ఉంచుతాయి.
పొడి బారకుండా రక్షిస్తాయి.అంతేకాకుండా వారానికి ఒకసారి ఈ మాస్క్ ను వేసుకోవడం వల్ల హెయిర్ షైనీ గా మారుతుంది.
జుట్టు విరగడం, చిట్లడం వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
వింటర్ లో హెల్తీ స్కిన్ కు తోడ్పడే బెస్ట్ బాత్ పౌడర్ ఇది.. డోంట్ మిస్!