పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వెన్నలా కరిగిపోవాలంటే ఈ డ్రింక్ ను తీసుకోండి!
TeluguStop.com
మనలో చాలా మందికి పొట్టు చుట్టూ కొవ్వు( Belly Fat ) భారీగా పేరుకుపోయి ఉంటుంది.
దీన్నే బెల్లీ ఫ్యాట్ అంటారు.పొట్ట కొవ్వు కారణంగా బాడీ షేప్ అవుట్ అవుతుంది.
అలాగే మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ వంటి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది.
అందుకే పొట్ట పోపును కరిగించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.కఠినమైన వ్యాయామాలు చేయడంతో పాటు డైట్ ను ఫాలో అవుతుంటారు.
అయితే మీ రెగ్యులర్ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను కనుక చేర్చుకుంటే పొట్ట కొవ్వు వెన్నలా కరిగి పోవడం ఖాయం.
"""/" /
డ్రింక్ తయారీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు,( Coriander ) రెండు టేబుల్ స్పూన్లు సోంపు( Fennel Seeds ) మరియు రెండు అంగుళాల దాల్చిన చెక్క( Cinnamon ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ తయారు చేసుకున్న పొడిని వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
"""/" /
ఇప్పుడు ఈ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయ్యాక సేవించాలి.
నిత్యం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.
ముఖ్యంగా ధనియాలు, దాల్చినచెక్క, సోంపు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును క్రమంగా కరిగిస్తాయి.
బెల్లీ ఫ్యాట్ ను కొద్ది రోజుల్లోనే మాయం చేస్తాయి.అలాగే ఈ డ్రింక్ మెటబాలిజం రేటును పెంచి కేలరీలు వేగంగా బర్న్ అయ్యేలా ప్రోత్సహిస్తుంది.
అంతేకాకుండా ఈ డ్రింక్ బాడీలోని వ్యర్థాలను తొలగిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.
మధుమేహం ఉన్న వారికి కూడా ఈ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.రోజు ఉదయం ఈ డ్రింక్ ను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఆ హీరో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన….ఇలా లీక్ చేసిందేంటి?