బరువు తగ్గాలని భావిస్తున్నారా.. అయితే వెంటనే ఇది తెలుసుకోండి!

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది అధిక బరువు( Over Weight ) సమస్యతో బాధపడుతున్నారు.

ఓవర్ వెయిట్ కారణంగా వివిధ జబ్బులు వచ్చే రిస్క్ పెరగడమే కాకుండా శరీర ఆకృతి పూర్తిగా దెబ్బతింటుంది.

బాడీ షేప్ అవుట్ అవ్వడం వల్ల ఇత‌రులు చేసే బాడీ షేమింగ్ కామెంట్స్ మరింత ఆందోళనకు గురి చేస్తాయి.

ఈ క్రమంలోనే బ‌రువు తగ్గాలని( Weight Loss ) భావిస్తుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

"""/" / అందుకోసం ముందుగా ఒక నిమ్మ పండును( Lemon ) తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు( Garlic ) శుభ్రంగా పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మరియు నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి.

వీటితోపాటు హాఫ్ టీ స్పూన్ పచ్చి పసుపు కొమ్ము తురుము వేసి దాదాపు ఐదారు నిమిషాల పాటు మరిగి‌స్తే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.

"""/" / ఈ వెల్లుల్లి నిమ్మ నీరును( Garlic Lemon Water ) రోజుకు ఒకసారి కనుక తీసుకుంటే అద్భుత ఫలితాలు పొందుతారు.

ఈ డ్రింక్ శరీర మెటబాలిజం రేటును పెంచుతుంది.ఇది కేలరీలను మరింత వేగంగా కరిగించి వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.

నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.కాబట్టి బరువు తగ్గాలని భావిస్తున్న వారు తప్పకుండా ఈ డ్రింక్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

పైగా ఈ డ్రింక్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి మరియు ఈ డ్రింక్  మలినాలను తొలగించి బాడీని డీటాక్స్ సైతం చేస్తుంది.

స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న నవీన్ పోలిశెట్టి..