బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ డ్రింక్ మీకోసమే..!

ఇటీవల కాలంలో అధిక బరువు( Over Weight ) సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య చాలా అధికంగా పెరిగిపోతుంది.

ఓవర్ వెయిట్ అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.ఈ క్రమంలో బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను అస్సలు మిస్ అవ్వకండి.

మీ బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయడంలో ఈ డ్రింక్ ఉత్తమంగా సహాయపడుతుంది.

అందుకోసం ముందుగా అంగుళం అల్లం( Ginger ) ముక్క తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ బాగా బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు,( Coriander ) హాఫ్ టీ స్పూన్ జీలకర్ర( Cumin ) వేసుకోవాలి.

అలాగే ఫ్రెష్ అల్లం త‌రుము వేసుకొని దాదాపు పది నుంచి ప‌న్నెండు నిమిషాలు మరిగించాలి.

దాంతో మన డ్రింక్‌ అనేది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. """/" / స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో అర టీ స్పూన్ ఆర్గానిక్ తేనె( Organic Honey ) కలిపి సేవించడమే.

ఈ డ్రింక్ వెయిట్ లాస్ అవ్వాల‌ని భావించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రోజు ఉదయం టీ, కాఫీలకు బదులు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే మెటబాలిజం రేటు పెరుగుతుంది.

దాంతో శరీరం అధిక కేలరీలను బర్న్ చేస్తుంది.ఫలితంగా మీరు మరింత వేగంగా బరువు తగ్గుతారు.

"""/" / అంతేకాకుండా ఈ డ్రింక్ శరీరంలో కొవ్వు నిల్వలను అడ్డుకుంటుంది.పొట్ట చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ ను కరిగిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.అతి ఆకలి సమస్యను దూరం చేసి అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.

కాబట్టి వెయిట్ లాస్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే తప్పకుండా ఈ డ్రింక్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

పైగా ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.సీజనల్ గా వచ్చే జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలను వేగంగా తగ్గిస్తుంది.

మరియు తేనె కలపకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ ఈ డ్రింక్ హెల్ప్ చేస్తుంది.