నోటి పూతతో తరచూ ఇబ్బంది పడుతున్నారా.. అయితే మీ డైట్ లో ఈ డ్రింక్ ఉండాల్సిందే!
TeluguStop.com
నోటి పూత( Mouth Ulcer ).దీన్నే మౌత్ అల్సర్ అని పిలుస్తారు.
పిల్లలు నుంచి పెద్దల వరకు చాలా మంది చాలా కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో నోటి పూత కూడా ఒకటి.
నాలుక, దవడలు, పెదాలపై పండ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పికి గురిచేస్తాయి.నోటిపూత వల్ల తినడం, తాగడమే కాదు మాట్లాడటం కూడా చాలా బాధాకరంగా ఉంటుంది.
శరీరంలో వేడి ఎక్కువ కావడం, పోషకాల కొరత, డీహైడ్రేషన్, హార్మోన్ల అసమతుల్యత ( Nutrient Deficiency, Dehydration, Hormonal Imbalance )తదితర కారణాల వల్ల నోటి పూత ఏర్పడుతుంది.
మీరు కూడా తరచూ ఈ సమస్యతో బాధపడుతున్నారా.? అయితే మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను కచ్చితంగా చేర్చుకోవాల్సిందే.
ఈ డ్రింక్ నోటి పూతని తగ్గించడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా అడ్డుకుంటుంది.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఒక చూపు చూసేయండి.
"""/" /
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక నాలుగు జామ ఆకులను( Guava Leaves ) ముక్కలుగా తుంచి వేసుకుని దాదాపు పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జామాకుల వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ తేనె( Honey ) కలిపి తీసుకోవాలి.
రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఈ జామాకుల కషాయాన్ని కనుక తీసుకుంటే నోటి పూత సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.
"""/" /
నోటి పూతను వదిలించడానికి ఈ కాషాయం చాలా బాగా సహాయపడుతుంది.
పైగా ఈ కషాయాన్ని తాగడం వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం వంటి సమస్యలు తగ్గుతాయి.
నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.అంతేకాదు ఈ కషాయం జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యను నివారిస్తుంది.
నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పికి చెక్ పెడుతుంది.జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.మరియు ఈ కషాయాన్ని తాగడం వల్ల ఒంట్లో వ్యర్ధాలు సైతం బయటకు తొలగుతాయి.
గుడ్ న్యూస్ చెప్పిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్! ఆనందంలో కుటుంబం