వేసవిలో నీరసం కుమ్మేస్తుందా.. ఇది తీసుకుంటే క్షణాల్లో ఎనర్జిటిక్ గా మారతారు!

వేసవిలో నీరసం కుమ్మేస్తుందా ఇది తీసుకుంటే క్షణాల్లో ఎనర్జిటిక్ గా మారతారు!

ప్రస్తుత వేసవి కాలంలో ( Summer )అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో నీరసం ఒకటి.

వేసవిలో నీరసం కుమ్మేస్తుందా ఇది తీసుకుంటే క్షణాల్లో ఎనర్జిటిక్ గా మారతారు!

ఎండలు, అధిక వేడి, ఉక్క‌పోత కారణంగా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ మొత్తం డ్రాప్ అయిపోతుంటాయి.

వేసవిలో నీరసం కుమ్మేస్తుందా ఇది తీసుకుంటే క్షణాల్లో ఎనర్జిటిక్ గా మారతారు!

అలాంటి సమయంలో ఏ పని చేయలేకపోతుంటారు.చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.

అయితే అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను కనుక తీసుకుంటే క్షణాల్లో ఎనర్జిటిక్ గా మారతారు.

శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఎనర్జీ బూస్టర్ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఏడు లేదా ఎనిమిది జీడిపప్పు( Eight Cashews ) వేసి వాటర్ పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఈలోపు ఒక పుచ్చ‌కాయ ( Watermelon )ముక్క‌ను తీసుకుని స‌న్న‌గా త‌రిగి పెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న జీడిపప్పు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ) మరియు కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో మరో కప్పు నీళ్లు పోసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో ఒక కప్పు సన్నగా తరిగిన పుచ్చకాయ ముక్కలు మరియు రెండు టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు( Sabja Seeds ) వేసి బాగా కలిపితే మన ఎనర్జీ బూస్టర్ డ్రింక్ సిద్ధం అయినట్టే.

ప్రస్తుత వేస‌వి కాలంలో ఈ డ్రింక్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. """/" / నిత్యం ఒక గ్లాసు చొప్పున ఈ డ్రింక్ ను తీసుకుంటే నీరసం, అలసట వంటివి వెన‌క్కి తిరిగి చూడ‌కుండా ప‌రార్ అవుతాయి.

రోజంతా బాడీ శక్తివంతంగా ఉంటుంది.అలాగే ఈ డ్రింక్ డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.

శరీరంలో అధిక వేడిని తొలగిస్తుంది.తలనొప్పి నుంచి తక్ష‌ణ‌ ఉపశమనాన్ని అందిస్తుంది.

మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది.కాబ‌ట్టి ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ లో ఈ డ్రింక్ ను త‌ప్ప‌కుండా డైట్ లో చేర్చుకోండి.

పహల్గామ్ ఉగ్రవాదుల దాడి .. కెనడా వ్యాప్తంగా ఎన్ఆర్ఐల నిరసనలు

పహల్గామ్ ఉగ్రవాదుల దాడి .. కెనడా వ్యాప్తంగా ఎన్ఆర్ఐల నిరసనలు