ఎముకల బలహీనత, రక్తహీనత రెండిటికీ చెక్ పెట్టే బెస్ట్ డ్రింక్ ఇది!

ఇటీవల రోజుల్లో ఎక్కువ శాతం మంది డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని మరచిపోతున్నారు.

కడుపు నింపుకోవ‌డానికి ఏదో ఒకటి తింటున్నారే తప్ప శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించడంలో విఫలమవుతున్నారు.

ఫలితంగా రక్తహీనత, ఎముకల బలహీనత( Anemia, Bone Weakness ) తదితర సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.

ఇక అప్పుడు వాటిని వదిలించుకునేందుకు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు.అదంతా వద్దనుకుంటే కచ్చితంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

డైట్‌లో పోషకాహారం ఉండేలా చూసుకోండి.ఇకపోతే రక్తహీనత, ఎముకల బలహీనత రెండిటికీ చెక్ పెట్టే బెస్ట్ డ్రింక్ ఒకటి ఉంది.

అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఫూల్ మఖానా ( Fool Makhana )వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.

అదే పాన్ లో పది బాదం గింజలు( Almonds ), పది వాల్ నట్స్, రెండు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు( Pumpkin Seeds ), రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు( Cashew Nut ) వేసి దోరగా వేయించుకోవాలి.

మిక్సీ జార్ లో వేయించుకున్న పదార్థాలన్నిటినీ వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఆపై ఈ మఖానా నట్స్ పౌడర్ ను ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.

"""/" / ఆ తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు నీటిలో కలిపిన రాగి పిండిని వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.

అనంత‌రం రెండు టేబుల్ స్పూన్లు మఖానా నట్స్ పౌడర్, పావు టీ స్పూన్ యాలకుల పొడి మరియు వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము( Grate Jaggery ) వేసి రెండు నిమిషాల పాటు ఉడికిస్తే మంచి హెల్తీ అండ్ టేస్టీ రాగి జావ రెడీ అవుతుంది.

ఈ రాగి జావను రోజుకు ఒకసారి తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

"""/" / ముఖ్యంగా ఈ జావ కాల్షియం యొక్క గొప్ప మూలం, ఇది బ‌ల‌హీన‌మైన ఎముకలను బలోపేతం చేయడానికి మరియు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.

అలాగే ఈ రాగి జావాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.ఇది శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచి రక్తహీనతను తరిమికొడుతుంది.

అంతేకాకుండా ఈ రాగి జావ‌లో మెండుగా ఉండే ప్రోటీన్లు, అమినో యాసిడ్లు అకాల వృద్ధాప్యం మరియు వివిధ‌ చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.ఇక రాగిలో అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు, ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను నిర్వహించడానికి మరియు బరువు నిర్వహణకు దోహద ప‌డుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారు కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే!