ఒళ్లు నొప్పులు విప‌రీతంగా వేధిస్తున్నాయా? అయితే వెంట‌నే ఇలా చేయండి!

ఒళ్లు నొప్పులు లేదా బాడీ పెయిన్స్‌.స‌ర్వ సాధార‌ణంగా ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

శ్ర‌మ‌కు మించి ప‌ని చేయ‌డం, ఒత్తిడి, జ్వ‌రం, అతిగా వ్యాయామం చేయ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఒళ్లు నొప్పులు వేధిస్తూ ఉంటాయి.

దాంతో వాటి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డం కోసం పెయిన్ కిల్ల‌ర్స్‌పై ఆధార‌ప‌డుతుంటారు.అయితే ఒళ్ళు నొప్పులు బాధించిన ప్రతీసారి పెయిన్ కిల్ల‌ర్స్‌ను వాడ‌టం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్‌ను తీసుకుంటే ఒళ్లు నొప్పులు దూరం అవ్వ‌డ‌మే కాదు ఆరోగ్యానికి బోలెడ‌న్ని లాభాలు కూడా చేకూర‌తాయి.

మ‌రి ఒళ్లు నొప్పుల‌ను త‌రిమికొట్టే ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాట‌ర్ పోయాలి.

అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసి ఉండ‌లు లేకుండా క‌లిపి.

ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి.ఇలా ఉడికించుకున్న రాగి మిశ్ర‌మాన్ని పూర్తిగా చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత బ్లెండ‌ర్ తీసుకుని అందులో నాలుగు జీడిప‌ప్పులు, నాలుగు బాదం ప‌ప్పులు, మూడు వాల్ న‌ట్స్‌, చ‌ల్లార‌బెట్టుకున్న రాగి మిశ్ర‌మం, మూడు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, ఒక గ్లాస్ కాచి చ‌ల్లార్చిన‌ పాలు వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే బాడీ పెయిన్స్ రిలీఫ్ డ్రింక్ సిద్ధం అవుతుంది.

"""/"/ ఒళ్లు నొప్పులు విప‌రీతంగా వేధిస్తున్న‌ప్పుడు వెంట‌నే ఈ సూప‌ర్ టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్‌ను త‌యారు చేసుకుని తీసుకోవాలి.

త‌ద్వారా అందులో ఉండే ప‌లు పోష‌క విలువ‌లు ఒళ్లు నొప్పుల నుంచి మంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి.

అంతేకాదు, పైన చెప్పుకున్న హెల్తీ డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకుంటే నీర‌సం, అల‌స‌ట దూరం అవుతాయి.

శ‌రీరం ఎన‌ర్జిటిక్‌గా మారుతుంది.అతి ఆక‌లి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.

ఎముక‌లు, కండ‌రాలు బ‌లంగా కూడా త‌యారు అవుతాయి.

బాలీవుడ్ సినిమాలు అందుకే ఫ్లాప్ అవుతున్నాయ్.. సంజయ్ దత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!