పాలు, ఖ‌ర్జూరాలు, నెయ్యి క‌లిపి ఇలా తీసుకుంటే ర‌క్త‌హీన‌త ప‌రార్‌!

ర‌క్త‌హీన‌త‌.దీనినే ఎనీమియా అంటారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మందిని ర‌క్త‌హీనత‌ స‌మ‌స్య తీవ్రంగా క‌ల‌వ‌ర పెడుతోంది.పెద్ద‌లే కాదు పిల్ల‌లు కూడా త‌ర‌చూ ర‌క్త‌హీన‌త బారిన ప‌డుతుంటారు.

దాంతో బ‌రువు ఉన్న‌ట్లుండి పెర‌గ‌డం లేదా త‌గ్గ‌డం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చ‌లి అధికంగా ఉండ‌టం, నీరసం, అల‌స‌ట వంటి ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి.

అయినాస‌రే ర‌క్త‌హీన‌త‌ను నిర్ల‌క్ష్యం చేస్తే ప్రాణాల‌కే ముప్పుగా మారుతుంటుంది.అందుకే ర‌క్త‌హీన‌త‌ను వ‌దిలిచుకోవ‌డం కోసం చాలా మంది మందులు వాడుతుంటారు.

అయితే కొన్ని కొన్ని ఆహారాల ద్వారా కూడా ర‌క్త‌హీన‌త‌ను త‌రిమికొట్ట‌వ‌చ్చు.ముఖ్యంగా పాలు, ఖ‌ర్జూరాలు, నెయ్యి క‌లిపి ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే ర‌క్త‌హీన‌త ప‌రార్ అవ్వ‌డం ఖాయం.

మ‌రి లేటెందుకు పైన చెప్పిన మూడు ప‌దార్థాలు క‌లిపి ఎలా తీసుకోవాలో చూసేయండి.

ముందుగా ఐదు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాల‌ను ఒక గిన్నెలో వేసుకుని వాట‌ర్ పోసి నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే నాన‌బెట్టుకున్న ఖ‌ర్జూరాల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్‌ను పోయాలి.

పాలు కాస్త హీట్ అవ్వ‌గానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖ‌ర్జూరం పేస్ట్‌, వ‌న్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రెండు నుంచి న‌లుగు నిమిషాల పాటు మ‌రిగించాలి.

"""/"/ ఆపై స్ట‌వ్ ఆఫ్ చేసి ఖ‌ర్జూరం పాల‌ను గోరువెచ్చ‌గా అయిన త‌ర్వాత తాగేయ‌డ‌మే.

రోజుకు ఒక‌సారి ఈ డ్రింక్‌ను తీసుకుంటే ఎలాంటి ర‌క్త‌హీన‌త అయినా ప‌రార్ అవ్వ‌డం ఖాయం.

పిల్ల‌ల‌కు కూడా రోజు ఈ ఖ‌ర్జూరం పాల‌ను ఇస్తే.వారు ర‌క్త‌హీన‌త బారిన ప‌డ‌కుండా ఉంటారు.

అదే స‌మ‌యంలో ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బూస్ట్ అవుతుంది.మెద‌డు మ‌రింత మెరుగ్గా ప‌ని చేస్తుంది.

శ‌రీరానికి కావాల్సిన మ‌రెన్నో పోష‌కాలు సైతం ఈ ఖ‌ర్జూరం పాల ద్వారా పొంద‌వ‌చ్చు.

 .