మానసిక ఆందోళనను తగ్గించడంలో ఈ ఆహారం అద్భుతంగా పనిచేస్తుంది!
TeluguStop.com
బాధ, ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిస్పృహ.పదం ఏదైనప్పటికీ వచ్చే అర్ధం ఒక్కటే, బాధ కూడా ఒక్కటే.
నేటి దైనందిత జీవితంలో యువత ఎక్కువగా ఒత్తిళ్ళ( Mental Anxiety )కు లోనవుతున్నారు.
అలాంటప్పుడే కొంచెం ప్రశాంతంగా వుండాలని నిపుణులు చెబుతున్నారు.అయితే మనలో చాలామంది సాధారణంగా ఏదన్నా ఒక విషయం గురించి ఎక్కువసేపు మధనపడినపుడు స్నాక్స్ , పంచదారతో కూడిన ఆహారపదార్ధాలను ఎక్కువగా తీసుకుంటారని ఓ సర్వే.
అయితే ఈ పదార్ధాలు తీసుకున్నప్పుడు మంచి అనుభూతిని కలిగించవచ్చు.కానీ దీర్ఘకాలంలో, ఆరోగ్యానికి ఇవి నష్టం కలిగిస్తాయి.
ఎందుకంటే ప్రాసెస్ చేసిన మాంసాలు, అధిక చక్కెర ఆహారాలు, టీ మరియు కాఫీ వంటివి కార్టిసాల్ ఉత్పత్తిని పెంచి ఆందోళన వంటి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాఏగాని తగ్గించవు.
"""/" / ఈ నేపథ్యంలో ఆరోగ్యనిపుణులు ఆందోళన వంటి సమస్యలను తగ్గించే కొన్ని ఆహార పదార్ధాలను సూచిస్తున్నారు.
జీడిపప్పు( Cashew ), నారింజ, డార్క్ చాక్లెట్, బెర్రీలు, పసుపు వంటివి ఆందోళనను తగ్గించడంలో సహాయపడే మంచి ఆహార పదార్ధాలు.
అయితే ఇపుడు ఆందోళనను తగ్గించే ఆహారాలు గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. """/" /
మొదటగా జీడిపప్పు గురించి చెప్పుకోవాలంటే ఇందులో వున్న అధిక మెగ్నీషియం కంటెంట్ కారణంగా విశ్రాంతి, ప్రశాంతత అనేది లభిస్తుంది.
అదేవిధంగా బెర్రీస్( Berries )లో వున్న యాంటీ ఆక్సిడెంట్లు కారణంగా ఆందోళన తీవ్రతరం తగ్గి ఆక్సీకరణ ఒత్తిడి నుండి శరీరం, మెదడును రక్షిస్తాయి.
"""/" / అదేవిధంగా బ్రస్సెల్స్ మొలకలలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది.
ఇక సాల్మన్ ఫిష్( Salmon Fish ) లో కనిపించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.
ఇక పసుపులో వుండే కర్కుమిన్ యాంటి యాంగ్జయిటీ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది.అదేవిధంగా ఊరగాయలలోని ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి, ఇది మెరుగైన మానసిక స్థితికి తోడ్పడుతుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్8, మంగళవారం 2024