ఈ జ్యూస్ ను వారానికి 2 సార్లు తీసుకున్న చాలు.. మీ లివర్ ఆరోగ్యానికి ఢోకా ఉండదు!

లివర్.( Liver ) మన శరీరంలో అతిపెద్ద అవయవం ఇది.

అలాగే మన శరీరంలో ఒకటి రెండు కాదు దాదాపు 500 పనులను లివర్ నిర్వర్తిస్తుంది.

బ్లడ్ ను ఫిల్టర్ చేయడం, మనం తీసుకున్న ఆహారంలోని వ్యర్థాలను విషతుల్యాలను తొలగించడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, ముఖ్యమైన హార్మోన్లను ఎంజైమ్‌లను తయారు చేయడం, హార్మోన్ లను కంట్రోల్ చేయడం, ఎనర్జీని స్టోర్ చేయడం, అవసరమైనప్పుడు దాన్ని వినియోగించడం.

ఇలా లివర్ ఎన్నో పనులు చేస్తుంది.అలాగే మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా వర్క్ చేయాలంటే లివర్ పాత్ర కీలకం.

అందుకే లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ జ్యూస్ ను వారానికి రెండు సార్లు తీసుకున్న చాలు.మీ లివర్ ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా ఒక కప్పు కర్బూజ పండు( Muskmelon ) ముక్కలు, ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి.

అలాగే అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని పొట్టు తొలగించి వాటర్ తో కడిగి పెట్టుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు, ( Watermelon Slices )కర్పూజ పండు ముక్కలు, అల్లం( Ginger ) మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. """/" / ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి సేవించాలి.

ఈ క‌ర్బూజ పుచ్చకాయ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా లివర్ ని క్లీన్ గా హెల్తీగా మారుస్తుంది.

వ్యర్థాలను తొలగిస్తుంది.వారానికి రెండు సార్లు ఈ జ్యూస్ ను తీసుకుంటే లివర్ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే ఈ జ్యూస్ మీ బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.వెయిట్ లాస్( Weight Loss ) కు సహాయపడుతుంది.

చర్మాన్ని యవ్వనం గా ఆరోగ్యంగా మారుస్తుంది.రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

కాబట్టి ఈ హెల్తీ జ్యూస్ ను ప్రతి ఒక్కరూ డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

ఆరోగ్యానికి అండంగా ఉండే బిర్యానీ ఆకు టీ.. రోజుకో క‌ప్పు తాగితే ఏం జ‌రుగుతుంది?