ఈ కాకి మాముది కాదు.. పిల్లిని ఎలా ఆటపట్టిస్తుందో చూడండి!

కుక్క, గుర్రం హాయిగా ఆడుకోవడం లేదా కోతి, పిల్లి కలిసి సరదాగా గడపడం మీరు చూసే ఉంటారు.

ఇంకా అనేక జంతువులు ఒకదానితో ఒకటి లోకాన్ని మరచి ఆడుకోవడం, వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కూడా చూసే ఉంటారు.

అయితే ఇప్పుడు పిల్లితో ఒక కాకి ఆడుకుంటున్న వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా పిల్లి అంటేనే కాకులకి హడల్.అవి వస్తున్నాయి అంటేనే కావ్‌ కావ్‌ మని కాకులు అరుచుకుంటూ ఎగురుకుంటూ అందనంత ఎత్తుకు చేరుకుంటాయి.

కానీ ఈ వీడియోలోని కాకి మాత్రం ఏం భయం లేకుండా పిల్లి దగ్గరికి వచ్చింది.

అంతేకాదు దానిని ఆటపట్టిస్తూ ఆశ్చర్యపరిచింది.దీనికి సంబంధించిన వీడియోను బీవైరల్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిల్లి, కాకి పబ్లిక్ పార్క్‌లో ఉండటం చూడవచ్చు.

పిల్లి ఒక పట్టాపై హాయిగా పడుకోగా కాకి దాని వెనుక వచ్చి వాలింది.

పిల్లి వెనక్కి తిరిగి చూడని సమయంలో కాకి పిల్లి దగ్గరకు దొంగచాటుగా వచ్చింది.

అలా ఆ కాకి నెమ్మదిగా పిల్లికి చాలా దగ్గరికి వచ్చింది.పిల్లి తన వెనకకు తిరిగినప్పుడు, కాకి వెంటనే కాస్త వెనక్కి వెళ్ళింది.

ఆ తర్వాత మళ్లీ పిల్లిని సమీపించింది.దాన్ని పొడవాలని కూడా చూసింది.

దాంతో పిల్లి వెంటనే అప్రమత్తమై లేచింది.ఆ తర్వాత దాన్ని అక్కడ నుంచి వెళ్లగొట్టింది.

ఈ కాకి సమస్య ఏంటి?" అంటూ @bviral అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసింది.

దీనికి లక్షల్లో వ్యూస్ 50 వేల వరకు లైకులు వచ్చాయి.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

భారతీయుడు 2 సినిమా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్…కారణం ఏంటంటే..?