డ్రోన్ల ద్వారా కుక్కలను పంపి శత్రు దేశాలపై దాడి చెయ్యాలని చూస్తున్నా ఈ దేశం..
TeluguStop.com
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ యుగం నడుస్తూ ఉంది.ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి దేశం ఏ పని చేయాలన్నా స్మార్ట్ గా ఆలోచిస్తూ ఉంది.
అలాగే ఏ దేశంలో అయినా యువత సరికొత్త టెక్నాలజీలను ప్రవేశపెడుతున్నారు.ఏ చిన్న పనిలో అయినా కొత్త టెక్నాలజీని తీసుకురావడం అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది.
ముఖ్యంగా ఏ దేశ ఆర్మీకైనా ఎప్పుడైనా సరే కొత్త టెక్నాలజీ అవసరం అవుతూ ఉంటుంది.
ఎందుకంటే ఏ దేశ ఆర్మీ పైన అయినా సరిహద్దు దేశాల సైనికులు దాడులు చేస్తూ ఉంటారు.
కాబట్టి ఆ దేశాలను కంట్రోల్ చేయడానికి ఆర్మీకి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో కూడిన టెక్నాలజీ అవసరమవుతుంది.
ఇలాంటి ఒక సరికొత్త టెక్నాలజీని చైనా ఆర్మీ తీసుకొచ్చింది.ఇప్పటివరకు మిషన్ గన్ తో కూడిన రోబో కుక్కలను చూశాం.
కానీ వాటినే రణరంగంలోకి దింపి శత్రువులపై మెరుపు దాడులు చేయించే సరికొత్త టెక్నాలజీని చైనా రక్షణ శాఖ ప్రవేశపెట్టింది.
"""/"/
ఇలాంటి డ్రోన్ల సహాయంతో మిషన్ ఉన్న రోబో కుక్కలను శత్రువులు ఉండే ప్రాంతంలో వదిలేస్తే, ఆ రోబో తన టార్గెట్ ను ఏర్పాటు చేసుకుని దాడులు చేస్తుంది.
ఇలాంటి మెరుపు దాడులు చేయడం వల్ల శత్రువులకు సైతం అర్థం కాకుండా సులభంగా వారిని అంతం చేయవచ్చని చైనా కుట్ర చేస్తుంది.
అంతేకాకుండా ఆ రోబో కుక్కకు నాలుగు కాళ్లపై నిలబడి గన్ను ఓపెన్ చేసి తన టార్గెట్ ను చూసుకుంటూ దాడులు చేస్తుంది.
అందుకు సంబంధించిన వీడీయో ని చైనా మిలటరీ అనుబంధంగా ఉండే కెస్ట్రెల్ డిఫెన్స్ బ్లడ్-వింగ్‌కి సంబంధించిన విబో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
అందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.ఈ వీడియోలో చూసినా కొంతమంది ఈ నేటిజెన్లు చైనాకు దొంగ దెబ్బ తీసే అలవాటు పోలేదని కామెంట్లు చేస్తున్నారు.
భర్తతో కలిసి ఖరీదైన కారును కొనుగోలు చేసిన సోనాక్షి సిన్హా.. ఈ కారు ఖరీదెంతో తెలుసా?