ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఏ నియోజకవర్గం అంటే?
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పటికీ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
కూటమి, వైసీపీ( YCP ) గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నా ఏ పార్టీది గెలుపో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
అయితే ఏపీలోని ఒక నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.ఆ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థులలో ఎక్కువమందికి మంత్రి పదవి దక్కడం గమనార్హం.
బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గం( Vemuru Constituency ) నుంచి పోటీ చేసిన అభ్యర్థులలో ఎనిమిది మందికి మంత్రి పదవులు దక్కాయి.
ఒక విధంగా ఇది రికార్డ్ అనే చెప్పాలి.ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో 15సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగడం గమనార్హం.
ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో ఎక్కువ సందర్భాల్లో అధికారంలోకి వచ్చింది.ఈ నియోజకవర్గం పేరు ఆంధప్రదేశ్ రాష్ట్రంలో మారుమ్రోగుతోంది.
"""/" /
ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) రుణమాఫీ హామీని ప్రకటిస్తే కూటమి గోవింద అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జగన్ మాత్రం ఈ హామీని ప్రకటిస్తారో లేదో అనే టెన్షన్ వైసీపీలో ఉంది.
ఎన్నికలకు రెండు వారాల సమయం ఉన్నా వైసీపీ మేనిఫెస్టోను ఇంకా ప్రకటించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ మాత్రం 10 కొత్త హామీలను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. """/" /
జగన్, కూటమి ఎన్నికల్లో గెలుపు కోసం భారీ హామీలను ప్రకటించగా ఆ హామీలను అమలు చేయడం సులువు అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ, కూటమిలలో ఏ పార్టీ కనీసం 100 స్థానాలలో విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.
వైసీపీ, కూటమి ఈ ఎన్నికల్లో గెలుపు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రజల్లో గుర్తింపు ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎక్కువగా పోటీ చేస్తుండటం అభ్యర్థులకు కలిసొస్తోంది.
ఎన్నికల సమయానికి రాష్ట్రంలో పరిస్థితులు ఏ పార్టీకి అనుకూలంగా మారతాయో చూడాలి.
పుష్పక్ ఎక్స్‌ప్రెస్ నుంచి దూకిన ప్రయాణికులు.. వేరే ట్రైన్ కింద నలిగిపోయి.. ఘోర వీడియో!