వైరల్: ఈ బుడ్డోడు మామ్మూలోడు కాదు… లేడీ డాక్టర్ ని ఎలా పడేశాడో చూడండి!
TeluguStop.com
సోషల్ మీడియా.ఇపుడు జనాలను శాసిస్తోందని చెప్పొచ్చు.
జగమంతా స్మార్ట్ ఫోన్స్ మయం కావడంతో సోషల్ మీడియా హవా బాగానే సాగుతోంది.
జనాల ఉత్సుకతను సోషల్ మీడియా బాగానే కాష్ చేసుకుంటోంది.అనునిత్యం ఇక్కడ కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.
అయితే అందులో ఏ కొన్నో నెటిజన్ల మనసులను దోచుకుంటాయి.కొన్ని ఫన్నీగా ఉంటే, మరొకొన్ని ఆశ్చర్యంగా, ఇంకొన్ని జుగుప్సాకరంగా ఉంటాయి.
ఇంకొన్ని వీడియోలు మనసుకి హత్తుకునేవిగా ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవును, @Gabriele Corno అనే ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ చిన్నపిల్లాడికి జ్వరం వచ్చిందో ఏమో.ఓ డాక్టర్ దగ్గరకు వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లారు.
అయితే అక్కడున్నది ఓ లేడీ డాక్టర్.సదరు లేడీ డాక్టర్ స్టెతస్కోప్ తో పిల్లాడి హార్ట్ బీట్ ను చెక్ చేసేటప్పుడు మొదట పిల్లాడు కాస్త దిగులుగా కనిపించాడు.
కానీ ఆ తరువాత మెల్లిగా పిల్లాడి మూడ్ పూర్తిగా మారిపోయింది. """/" /
అలా ఆమె స్టెతస్కోప్ తో పిల్లాడి హార్ట్ బీట్ చెక్ చేయడానికి సుతారంగా తాకుతూ ఉంటే లేడీ డాక్టర్ చేతిమీద తలపెట్టుకుని ఆరాధనా భావంతో ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోవడం ఈ వీడియోలో మనం చూడవచ్చు.
ఆ సమయంలో పిల్లాడి ముఖంలో కనిపించిన నవ్వుకు లేడీ డాక్టర్ అమాంతం పడిపోయింది.
"""/" /
వెంటనే ఆ బుడ్డోడి బుగ్గలను ప్రేమగా తాకుతుంది.కాగా ఈ వీడియోకి నెటిజన్స్ ఫిదా అయిపోయారు.
లేడి డాక్టర్ దగ్గర ఈ పిల్లాడి ప్రవర్తనకు మనోళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ బుడ్డోడిలో అప్పుడే ఎన్ని కళలు ఉన్నాయో అని చమత్కరిస్తున్నారు.డాక్టరమ్మతో ప్రేమలో పడిన ఈ బుడ్డోడు, నెటిజన్స్ తనతో ప్రేమలో పడేలా చేసుకున్నాడు.
ఆ ఇద్దరు స్టార్ హీరోలు డైరెక్టర్లకు సరెండర్ అయితేనే వాళ్ళకి సూపర్ సక్సెస్ లు వస్తాయా..?