ఈ కేటుగాడు మామూలోడు కాదు.. ప‌ద‌కొండు మంది అమ్మాయిల ద‌గ్గ‌ర రూ.కోట్ల‌లో వ‌సూలు

సాధారణంగా బట్టతల ఉన్న యువకులను యువతులు ఇష్టపడరు.ఈ క్రమంలోనే తమకున్న బట్టతలను కవర్ చేసుకునేందుకు బట్టతల ఉన్న ఉన్నవారు ప్రయత్నిస్తుంటారు.

ఇక పెళ్లి చూపులకు వెళ్లిన క్రమంలో అయితే బట్టతల ఉన్నట్లు ఏ కొద్దిగా అనుమానం వచ్చినా అది నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

అయితే, బట్టతల ఉన్నప్పటికీ దాన్ని కవర్ చేసి బట్టతల లేనట్లు ఫొటో పెట్టి మ్యాట్రీమొని సైట్‌లో పెట్టి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదకొండు మంది అమ్మాయిల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు.

ఈ నేపథ్యంలోనే సదరు యువతుల నుంచి దాదాపు మూడు కోట్ల రూపాయలు కాజేశాడు అతగాడు.

వివరాల్లోకెళితే.ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర చిన్న విలేజ్‌కు చెందిన సదరు వ్యక్తి ఐటీ ఉద్యోగిగా కొంతకాలం పని చేశాడు.

కాన్పూరులో ఎంటెక్ మధ్యలోనే ఆపేశాడు.తన టాలెంట్‌ను తప్పుడు త్రోవలో ఉపయోగించడం షురూ చేశాడు.

అమ్మాయిలకు మాయమాటలు చెప్పి మోసం చేయాలని డిసైడ్ అయి తన బట్టతలను కవర్ చేస్తూ వారిని వలలో వేసుకున్నాడు.

అలా అమ్మాయిను మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించి డబ్బులు గుంజడం స్టార్ట్ చేశాడు.భారీ మొత్తంలోనే నగదు తీసుకున్నాడు.

ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మరికొంత మంది యువతులను నమ్మించాడు.ఈ నేపథ్యంలోనే క్రికెట్ బెట్టింగ్‌లు కూడా పెట్టాడు.

కాగా, సదరు వ్యక్తిపై చిత్తూరు జిల్లాకు చెందిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమను మోసం చేశాడని పోలీసుల కంప్లయింట్ మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. """/"/ బాధితుల సమాచారం మేరకు అతడిని అరెస్టు చేశారు.

విచారణ సమయంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.అమ్మాయిలను మోసం చేసే ప్రతీ సారి సదరు వ్యక్తి నకిలీ ప్రొఫైల్ యూజ్ చేసవాడని, కొత్త సిమ్ కార్డు తీసుకునే వాడని పోలీసులు తెలిపారు.

ఇకపోతే అమ్మాయిలను వలలో వేసుకునేందుకుగాను తన గురించి తాను బాగా బిల్డప్ ఇచ్చేవాడని, అతడి మాటలు నమ్మి ఉద్యోగినులు డబ్బులు ఇచ్చి మోసపోయారని నిర్ధారించారు.

ఒక్కో ఉద్యోగిని వద్ద రూ.లక్షల్లో డబ్బులు తీసుకున్నాడని, అలా కోట్ల రూపాయలు పోగు చేసుకున్నాడని పేర్కొన్నారు పోలీసులు.

ఈ మోసగాడి పేరు పున్నాటి శ్రీనివాస్ కాగా, శ్రీనివాసా మాజాకా అన్నట్లు మోసాలు చేశాడని స్థానికులు అనుకుంటున్నారు.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ … నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి