ఈ పిల్లి మామూలు స్మార్ట్ కాదు.. ఏం పని చేసిందో చూడండి!

సోషల్ మీడియా పరిధి రోజురోజుకీ పెరగడంతో ఎన్నో రకాల వీడియోలు ఇక్కడ హల్ చల్ చేస్తూ ఉంటాయి.

అందులో కొన్ని మాత్రమే నెటిజన్ల హృదయాలను తాకుతాయి.దాంతో సదరు వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

ఏదో ప్రత్యేకత ఉంటేగాని అవి వైరల్ కావు.కాస్త ఫన్నీగా అయినా ఉండాలి, లేదా ఆశ్చర్యంగా అయినా అనిపించాలి, లేదంటే అద్భుతంగా అయినా కనబడాలి.

ఇందులో ఏదో ఒక ప్రత్యేకంగా లేనిదే నెటిజన్ల మనసులులని ఆకట్టుకోలేవు.ఈమధ్య కాలంలో చూసుకుంటే జంతువులకు సంబందించిన అనేకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

పెంపుడు కుక్కలు, పిల్లుల వీడియోలు ప్రతినిత్యం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంటాయి.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిల్లి వీడియో ఒకటి నెటిజన్లు షాక్‌ అయ్యేలా చేస్తుంది.

"మేడ్ యు స్మైల్" ట్విట్టర్ పేజీ ద్వారా ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ అయ్యింది.

ఆ వీడియో లో ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ పనులు చేస్తూ కనిపించడం మనం చూడవచ్చు.

ఆ వీడియోలో అతని పక్కనే ఉన్న ఫ్రిజ్ పైన పిల్లి కూర్చుని ఉండటం మనం చూడవచ్చు.

ఎలక్ట్రీషియన్ వైర్లను పైకి లేపినప్పుడు, పిల్లి దాని తల పైకెత్తి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది చూడండి.

"""/"/ ఆ పని తనకేదో తెలిసినట్టు వ్యహరిస్తుంది ఆ పిల్లి.అందులో ఏముందా అని కాస్త దీర్ఘంగా కూడా ఆలోచిస్తుంది.

దాంతో ఫన్నీగా వున్న ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఇప్పటి వరకు 66 లక్షల మంది చూడగా చాలా మంది వీడియో కింద రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

పిల్లి చేష్టలు చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు.అదే సమయంలో కొందరు నెటిజన్లు విపరీతంగా కామెంట్‌ చేశారు.

పిల్లిమామ! జాగ్రత్త, ముడ్డి పగిలిపోతుంది.అని ఒకరంటే, కొంత మంది స్మార్ట్ పిల్లి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్ వేసి అనిపించింది చెప్పండి.