మలబద్ధకం వేధిస్తుందా.. క్యారెట్ తో సమస్యను తరిమికొట్టండిలా!
TeluguStop.com
ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో మంది మలబద్ధకంతో( Constipation ) బాధ పడుతుంటారు.
కానీ ఈ సమస్య గురించి ఇతరులతో చర్చించేందుకు సంకోచిస్తుంటారు.అలా అని మలబద్ధకం సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఒంట్లో సర్వ రోగాలు తలెత్తుతాయి.
కాబట్టి మలబద్ధకం సమస్యను ఎంత త్వరగా తరిమి కొడితే ఆరోగ్యానికి అంత మంచిదిజ అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు చాలా బాగా సహాయపడతాయి.
క్యారెట్( Carrot ) కూడా ఆ కోవకే చెందుతుంది.ముఖ్యంగా క్యారెట్ ని ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మలబద్ధకం పరార్ అవ్వాల్సిందే.
అందుకోసం ఒక చిన్న సైజు క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ క్యారెట్ ముక్కలను ఆవిరిపై పది నిమిషాల పాటు ఉడికించి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో స్ట్రీమ్ చేసుకున్న క్యారెట్ ముక్కలతో పాటు ఒక అరటిపండు,( Banana ) రెండు టేబుల్ స్పూన్ల తేనె( Honey ) మరియు ఒక గ్లాసు ఫ్యాట్ లెస్ మిల్క్ లేదా బాదం మిల్క్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మంచి ఫైబర్ రిచ్ షేక్ రెడీ అవుతుంది.
"""/" /
ఈ క్యారెట్ బనానా షేక్ ను( Carrot Banana Shake ) ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.
వారానికి మూడుసార్లు ఈ షేక్ ను కనుక తాగితే అదిరిపోయే లాభాలు మీ సొంతమవుతాయి.
క్యారెట్ మరియు అరటి పండులో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది.ఇది జీర్ణక్రియ పనితీరును పెంచుతుంది.
మలబద్ధకం సమస్యను తరిమి తరిమి కొడుతుంది.అలాగే ఈ షేక్ లో విటమిన్ ఎ ఉంటుంది.
ఇది కంటి వ్యాధి అయిన జిరోఫ్తాల్మియాను నివారించడంలో సహాయపడుతుంది.లెన్స్ మరియు రెటీనాను రక్షిస్తుంది.
"""/" /
అంతేకాదు ఈ హెల్తీ క్యారెట్ బనానా షేక్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడతాయి.
కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో, రక్తపోటును నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి.గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.
కాల్షియం మరియు విటమిన్ కె వంటి పోషకాలకు మంచి మూలమైన క్యారెట్ బనానా షేక్ ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తాయి.